Don 3 - Ranveer Singh - Kiara Advani: అవును బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన 'డాన్' మూవీ తెలుగు సహా ఎన్నో భాషల్లో రీమేక్ అయింది. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ సినిమాను తెలుగులో అన్న ఎన్టీఆర్ 'యుగంధర్' పేరుతో రీమేక్ చేశారు. ఆ తర్వాత చాలా యేళ్లకు ప్రభాస్ కూడా 'బిల్లా' పేరుతో రీమేక్ చేసారు. అప్పట్లో అన్నగారికి దక్కిన సక్సెస్.. రెబల్ స్టార్‌కు దక్కలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ సంగతి పక్కన పెడితే.. హిందీలో కల్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన 'డాన్' మూవీని ఎన్నో ఏళ్ల తర్వాత ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా అదే 'డాన్' టైటిల్‌తో తెరకెక్కింది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత అదే ఊపులో తమిళంలో అజిత్ 'బిల్లా' పేరుతో రీమేక్ చేసారు. అంతకు ముందు రజినీకాంత్ 'బిల్లా' పేరుతో అమితాబ్ డాన్‌ను రీమేక్ చేసారు. దాదాపు ప్రభాస్ బిల్లా తప్పించి రీమేక్ చేసిన అన్ని సార్లు 'డాన్' మూవీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.


షారుఖ్‌తో 'డాన్' మూవీ సూపర్ హిట్ కావడంతో ఆ మూవీకి సీక్వెల్‌గా 'డాన్ 2' మూవీ తెరకెక్కించాడు. ఆ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మరోవైపు ఈ సినిమాకు సీక్వెల్‌గా 'డాన్ 3' మూవీని తెరకెక్కిస్తున్నట్టు ఫర్హాన్ అక్తర్ ప్రకటించారు. ఈ సారి ఈ సీక్వెల్‌లో షారుఖ్ కాకుండా రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నాడు. త్వరలో షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది.


ఇక 'డాన్ 3' మూవీ కూడా కొత్త కాన్సెప్ట్‌తో ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాను తీర్చిదిద్దబోతున్నట్టు సమాచారం. మరి డాన్, డాన్ 2 మాదిరే రణ్‌వీర్ సింగ్‌తో 'డాన్ 3' మూవీతో ఫర్హాన్ సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.


ఇదీ చదవండి: హరీష్ రావును చూస్తుంటే.. మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారు.. బీఆర్ఎస్ ను ఏకీపారేసిన సీఎం రేవంత్ రెడ్డి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook