Double Ismart First Review: గత కొన్నేళ్లుగా తెలుగు సహా అన్ని ఇండస్ట్రీస్ లో సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కించడం కామన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాపై ముందుగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలన విజయం సాధించింది. అంతేకాదు అప్పటి వరకు ఉన్న రామ్ పోతినేని ఇమేజ్ ను పూర్తి మేకోవర్ తో కొత్తగా చూపించాడు. ఈ సినిమాతో రామ్  పోతినేని మాస్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. రీసెంట్ గా విడుదలైన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా ట్రైలర్ చూసి రొటిన్ అంటూ క్రిటిక్స్ పెదవి విరుస్తున్నా.. మాస్ లో మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. మొత్తంగా ఈ సినిమా రామ్ పోతినేని, కావ్య థాపర్ తో చేసిన సాంగ్స్, సీన్స్ అదిరిపోయాయని మాస్ జనాలు చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘డబుల్ ఇస్మార్ట్’ మూవీకి సెన్సార్ వాళ్లు A సర్టిఫికేట్ జారీ చేసారు. అంతేకాదు ఈ సినిమాలో కొన్ని సీన్స్ పిల్లలు చూసేలా లేవని చెప్పారు. అంతేకాదు ఈ సినిమాలో హింస, రక్తం, సెక్స్ అంశాలు పెక్కుగా ఉన్నాయని చెబుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ మూవీకి కాస్త దగ్గరగా ఉన్నా.. మాస్ అంశాలు పుష్కలంగా ఉన్నాయనేది సెన్సార్ వాళ్లు చెబుతున్నారు. చాలా కాలం తర్వాత అలీ కామెడీ ఈ సినిమాలో పండిందని చెబుతున్నారు. సినిమాలో కొన్ని సన్నివేశాలు రొటీన్ గా ఉన్నా.. మాస్ ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు సంజయ్ దత్, రామ్ పోతినేని మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయట. మొత్తంగా ఈ సినిమా యావరేజ్ గా ఉందనే టాక్ వినిపిస్తోంది. రేపు విడుదల తర్వాత ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ ఏ మేరకు ఫలితం అందుకుంటుందో చూడాలి.


‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ  థియేట్రికల్ రైట్స్  భారీ రేటుకు అమ్మడుపోయాయి. తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ అదే రేంజ్ లో అమ్ముడు పోయాయి. ఇస్మార్ట్ శంకర్ ను మించిన డబుల్ డోస్ తో ఈ సినిమా ఉండబోతున్నట్టు సమాచారం. దీంతో ఈ సినిమాపై ఉత్తరాదిలో మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్  కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ రూ. 35 కోట్లకు  సొంతం చేసుకుంది.  హిందీ తప్ప మిగిలిన నాలుగు భాషలకు సంబంధించి డిజిటల్ డీల్ క్లోజ్ అయింది.‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా విషయానికొస్తే. ఈ సినిమా రిలీజైన 7 వారాలకు స్ట్రీమింగ్ కు వచ్చేలా ముందుగానే ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం.‘డబుల్ ఇస్మార్ట్’ మూవీని వచ్చే నెల ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల కాబోతుంది.


ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..


ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter