NTR Vs ANR Vs Chiru: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..

NTR Vs ANR Vs Chiru: సినిమా ఇండస్ట్రీలో ఒక సూపర్ హిట్ టైటిల్ తో ఆ తర్వాత పలు చిత్రాలు రావడం ఎప్పటి నుంచో ఉంది. ఇక అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, చిరంజీవిలు ఒకే టైటిల్ తో సినిమాలు చేసారు. ఇంతకీ ఏమిటా సినిమా.. ? ఒకే పేరుతో వచ్చిన ఈ సినిమాల్లో హిట్ అందుకున్నది ఎవరు ?

1 /10

సినీ ఇండస్ట్రీలో పదేళ్ల తర్వాత ఒక సినిమా టైటిల్ ను రిపీట్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది.  ప్రతి దశాబ్దం తర్వాత ఒక సినిమా టైటిల్ ను వేరే సినిమాను పెట్టవచ్చనే రూల్ కూడా ఉంది.

2 /10

తెలుగులో ఈ తరహా ఒకే సినిమా టైటిల్ తో వేరు వేరు కాలాల్లో సినిమాలు వచ్చాయి. ఒక్కోసారి ఒక సినిమా టైటిల్ సూపర్ హిట్ అయితే దాన్ని వాడుకోవడానికే ఎక్కువ మంది మేకర్స్ ఇష్టపడుతుంటారు.

3 /10

ఇక 1962లో ఎన్టీఆర్, సావిత్రి హీరో, హీరోయిన్లుగా ‘ఆరాధన’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మ్యూజికల్ గా హిట్ గా నిలిచింది.

4 /10

వి.మధుసూదన రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను జగపతి ఆర్ట్స్ పిక్చర్ పతాకంపై వీరమాచనేని బాబు రాజేంద్ర ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  ఈ సినిమా బెంగాలీలో వచ్చిన ‘సాగరిక’ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది.

5 /10

ఆ తర్వాత 14 యేళ్లకు 1976లో ఇదే ‘ఆరాధన’ టైటిల్ లో ఎన్టీఆర్, వాణిశ్రీ హీరో, హీరోయిన్లుగా బి.వి. ప్రసాద్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. ఈ సినిమా హిందీలో వచ్చిన ‘గీత్’ మూవీకి రీమేక్.

6 /10

హిందీలో ‘గీత్’ చిత్రం హిమాచల్ ప్రదేశ్ నేపథ్యంలో తెరకెక్కితే.. తెలుగులో కూడా అదే నేటివిటితో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

7 /10

ఎన్టీఆర్ ‘ఆరాధన’ సినిమా వచ్చిన 11 యేళ్లు మెగాస్టార్ చిరంజీవి .. భారతీరాజా దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ సినిమాను తెరకెక్కించారు.

8 /10

ఈ సినిమా తమిళంలో సత్యరాజ్ హీరోగా తెరకెక్కిన ‘కవితోరా కవితాంగైల్’ మూవీకి రీమేక్. కానీ తెలుగులో చిరు హీరోగా తెరకెక్కిన ‘ఆరాధన’ సినిమా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాలో సెకండ్ హీరోగా రాజశేఖర్ హీరోగా నటించారు.  

9 /10

మొత్తంగా అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు, చిరంజీవి హీరోలుగా తెరకెక్కిన ‘ఆరాధన’ మూడు చిత్రాలు కూడా ఇతర భాషల్లో హిట్టైన సినిమాలకు రీమేక్ కావడం విశేషం.

10 /10

మరోవైపు ఏఎన్నార్, ఎన్టీఆర్ లకు ‘ఆరాధన’ టైటిల్ తో బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకుంటే.. చిరంజీవి మాత్రం ‘ఆరాధన’ టైటిల్ తో ఫ్లాప్ అందుకోవడం విశేషం.