Drishyam 2: దృశ్యం. విభిన్నమైన సినిమా. కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఓ సామాన్యుడు పడిన వ్యధ..చేసిన ప్రయత్నాలకు ప్రతిరూపం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, సింహళీ భాషల్లో విజయం సాధించిన సినిమా. ఇప్పుడు దృశ్యం 2 దూసుకుపోతోంది. మరి తెలుగులో రానుందా ఇది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ( Mohanlal ), మీనా ( Meena ) ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ 2013లో దృశ్యం సినిమా (Drishyam movie )ను మలయాళంలో తెరకెక్కించాడు. కేరళ రాష్ట్రంలో 75 కోట్ల వసూళ్లు రాబట్టి..ఓ సంచలనంగా మారింది. అందుకే తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, సింహళీ భాషల్లో రీమేక్‌తో కూడా అంతే విజయాన్ని కైవసం చేసుకుంది. తెలుగులో వెంకటేశ్ ( Venkatesh ), మీనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కించడమే కాకుండా బాక్సాఫీసు వద్ద అద్భుత విజయం సాధించింది. అంతటి విజయాన్ని సాధించినందునే దృశ్యం మరోసారి తెరకెక్కింది. దృశ్యం 2 తెరకెక్కడమే కాకుండా విడుదలై దూసుకుపోతోంది. అమెజాన్ ప్రైమ్ ( Amazon prime )‌లో విడుదలై హిట్‌టాక్ మూటగట్టుకుపోయింది.


దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా దృశ్యం 2( Drishyam 2 ) ఫిబ్రవరి 19 న విడుదలైంది. దృశ్యం సీక్వెల్ నిజంగానే మాస్టర్ పీస్ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నాయి. దృశ్యం 2 విజయం సాధించడంతో నెటిజన్లంతా ఇప్పుడు దృశ్యం సీక్వెల్ తీయాలని కామెంట్లు చేస్తున్నారు. వెంకీ హీరోగా రీమేక్ చేయాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. ఇప్పటికే దృశ్యం 2 రీమేక్ హక్కుల్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ దక్కించుకుంది. కానీ ఎవరితో రీమేక్ చేయనుందో సంస్థ వెల్లడించలేదు. ప్రస్తుతానికి వెంకటేశ్ అయితే ఎఫ్ 3 ( F3 movie ), నారప్ప సినిమాలతో బిజీగా ఉన్నాడు.


Also read: Hina khan purple lehenga pics: పర్పుల్ కలర్ బ్యాక్‌లెస్ బ్లౌజ్‌తో అదరగొడుతున్న హీనా ఖాన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook