Drugs Case: డ్రగ్స్‌ కేసు బాలీవుడ్(Bollywood) ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఈ కేసులో కింగ్ ఖాన్ షారుక్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టైన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్యన్(AryanKhan)తో జరిపిన వాట్సాప్‌ చర్చల్లో నటి అనన్య పేరు రావడం చర్చనీయాంశంగా మారింది.  నిన్న అధికారులు ఆమె నివాసానికి వెళ్లి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో అనన్య(Ananya Pandey) గురువారం మధ్యాహ్నం ఎన్‌సీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు అనన్యను విచారించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Shah Rukh Khan Meets His Son: ఆర్యన్​ ఖాన్​ను కలిసేందుకు ఆర్థర్​ రోడ్​ జైలుకు వెళ్లిన షారుక్​


నేను జోక్ చేశా: ఆనన్య
ఆర్యన్‌తో వాట్సాప్‌ చాట్‌ గురించి ప్రశ్నించగా.. వీరిద్దరి మధ్య గంజాయి కోసం వాట్సాప్‌ చర్చ జరిగిందని ఎన్‌సీబీ(NCB) అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. గంజాయి కోసం ఆర్యన్‌ అడగ్గా.. ఏర్పాటు చేస్తానని అనన్య చెప్పినట్లు ఆ చాట్‌(Whtat'sup chat)లో ఉందని సమాచారం. ఈ చాట్‌ను చూపించి అధికారులు ప్రశ్నించగా.. తాను కేవలం జోక్‌ చేశానని అనన్య చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తాను ఎప్పుడూ డ్రగ్స్‌(Drugs) తీసుకోలేదని, ఎవరికీ సరఫరా చేయలేదని ఆమె చెప్పినట్లు తెలిసింది. అయితే ఆర్యన్‌ కోసం అనన్య డ్రగ్స్‌ పంపించినట్లు ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని తెలుస్తోంది.  ఎన్‌సీబీ విచారణ నిమిత్తం అనన్య తన తండ్రి చుంకీ పాండేతో కలిసి నిన్న కార్యాలయానికి వచ్చింది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook