Guns Gulaabs Official Trailer Out: ‘మ‌హన‌టి’, 'సీతారామం' వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు దుల్కర్ సల్మాన్(Dulquer Salman). ప్రస్తుతం ఇతడు నటిస్తున్న వెబ్ సిరీస్ గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’ (Guns & Gulaabs). ఇందులో బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు (Raj kumar rao) మరో లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుంచి విడుదలైన ఫ‌స్ట్ లుక్‌, టీజర్లుకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సిరీస్ ఆగ‌ష్టు 18నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ సోష‌ల్ మీడియా వేదికగా ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వెబ్‌ సిరీస్‌లో దుల్కర్‌ సల్మాన్‌ స్టైలిష్ పోలీసుగా కనిపించనున్నారు. దుల్కర్ కు ఇదే తొలి వెబ్ సిరీస్. గులాబ్ గంజ్ అనే ప్రాంతంలో గ్యాంగ్‌స్ట‌ర్స్‌కు, పోలీసుల‌కు మ‌ధ్య జరిగే వార్ గా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో పాన టిప్పు అనే గ్యాంగ్‌స్టర్‌గా రాజ్ కుమార్ రావు నటించారు. ద‌ ఫ్యామిలీమ్యాన్‌’ (The Family Man), ‘ఫర్జీ’ (Farzi) లాంటి వెబ్‌ సిరీస్‌లతో సూప‌ర్ హిట్స్ అందుకున్న దర్శకులు రాజ్‌ అండ్ డీకే (Raj & Dk) ఈ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. డీ2ఆర్ ఫిల్మ్స్; నెట్‌ఫ్లిక్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సిరీస్‌లో ఆదర్శ్‌ గౌరవ్, గుల్షన్‌ దేవయ్య, గౌత‌మ్ శ‌ర్మ‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. 



Also Read: Extra Ordinary Man: నితిన్ నయా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న 'డేంజర్ పిల్ల' సాంగ్..


Also read: Adah Sharma hospitalised: 'ది కేరళ స్టోరీ' నటి ఆదాశర్మకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook