Adah Sharma hospitalised: 'ది కేరళ స్టోరీ' నటి ఆదాశర్మకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక..

Actress Adah Sharma hospitalised: నటి ఆదాశర్మ అస్వస్థతకు గురైంది. పుడ్ అలర్జీ, డయేరియా కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం ఉదయం ఆదాను ఆస్పత్రిలో జాయిన్ చేశారు.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 3, 2023, 08:07 AM IST
Adah Sharma hospitalised: 'ది కేరళ స్టోరీ' నటి ఆదాశర్మకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక..

The Kerala Story's Adah Sharma hospitalised: హీరోయిన్ అదాశర్మ (Adah Sharma) అస్వస్థతకు గురైంది. పుడ్ అలర్జీ, డయేరియాతో ఆమె అనారోగ్యం బారిన పడినట్లు తెలిసింది. బుధవారం ఉదయం అదా ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటుందని సమాచారం. ఆమె త్వరగా కోలుకోవాలని ఆదా అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. రీసెంట్ గా ఆదా శర్మ 'కమాండో' అనే చిత్రంలో నటించింది. ఇది ఈ నెల 11 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లోనే ఈ బ్యూటీ పుల్ బిజీగా గడుపుతోంది. ఈనేపథ్యంలో ఆమె తాజాగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. 

ఈ ఏడాది విడుదలైన 'ది కేరళ స్టోరీ'(The Kerala Story)తో ఆదాశర్మ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా సృష్టించిన సంచలం అంతా ఇంతా కాదు. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించింది. కేరళలో కొన్నేళ్లుగా 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రానికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. 'హార్ట్ ఎటాక్' సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తొలి సినిమా సక్సెస్ అయినప్పటికీ ఆ తర్వాత తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో సైడ్ క్యారెక్టర్స్ కే పరిమితమైంది ఈ అమ్మడు. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి సత్తా చాటింది.  

Also Read: Jailer Trailer: రజినీ మార్క్ డైలాగ్స్, యాక్షన్ తో ‘జైలర్’ మూవీ ట్రైలర్.. మీరు చూసేయండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News