Duniya Vijay in #NBK107: నటసింహ నందమూరి బాలకృష్ణ సక్సెస్ ఫుల్ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో హై ఇంటెన్స్ మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో ప్రధాన తారాగణం పాల్గొంటుంది. తాత్కాలికంగా పెట్టిన #NBK107 టైటిల్ వున్న ఈ సినిమాతో కన్నడ స్టార్ దునియా విజయ్ టాలీవుడ్లోకి  ఆరంగేట్రం చేయనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముసలి మడుగు ప్రతాప్ రెడ్డిగా దునియా విజయ్ ని పరిచయం చేస్తూ, ఈ చిత్రం నుండి అతని ఫస్ట్ లుక్ నేడు విడుదలైంది.  సిగరెట్ తాగుతూ పోస్టర్లో రఫ్ గానూ, సీరియస్ లుక్ గెటప్ లో కనిపించాడు. ఆయన గెటప్ తో సినిమాలో ఆయన నటిస్తున్న పవర్ఫుల్ రోల్ ని తెలియజేస్తుంది. దునియా విజయ్ ఇప్పటికే షూట్లో జాయిన్ అయ్యాడు.


టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.


నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. గోపీచంద్ మలినేని  చిత్రాలు సాంకేతికంగా ఉన్నత స్థాయిని కలిగి ఉంటాయి. అందుకే నందమూరి 107 వ సినిమాకి కొంతమంది అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.



ఈ సినిమాకి ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తుండగా.. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ప్రఖ్యాత రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్. రామ్-లక్ష్మణ్ ద్వయం ఫైట్స్ కొరియోగ్రాఫ్  చేస్తున్న ఈ చిత్రానికి చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.


తారాగణం: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్
కథ, స్క్రీన్ ప్లే & దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీత దర్శకుడు: థమన్ ఎస్
కెమెరా: రిషి పంజాబీ
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
CEO: చిరంజీవి (చెర్రీ)
కో-డైరెక్టర్: కుర్రా రంగారావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి
లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం KVV
పబ్లిసిటీ: బాబా సాయి కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో


Also Read: Inter Exams 2022: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ లో మార్పు.. ఏ ఎగ్జామ్ ఎప్పుడో తెలుసుకోండి!


Also Read: Bhagwant Mann: పంజాబ్ 18వ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook