Pawan Kalyan OG : సెట్ నుంచి పవన్ కళ్యాణ్ ఫోటో.. మాటిస్తున్నామంటూ నిర్మాణ సంస్థ ట్వీట్
Pawan Kalyan OG Mumbai Schedule పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇప్పుడు హైద్రాబాద్‌లో ఉన్నాడు. మొన్ననే చంద్రబాబుని సైతం కలిశాడు. అయితే ఓజీ టీం ఇప్పుడు ముంబై నుంచి ప్యాకప్ చెప్పేసి వచ్చినట్టుంది.
Pawan Kalyan OG Mumbai Schedule పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఇందులో భాగంగా మొన్నటి వరకు ముంబైలో ఓజీ సినిమా షూటింగ్‌ను చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సెట్‌లోకి అడుగుపెట్టేలా ఉన్నాడు. ఆల్రెడీ వినోదయ సిత్తం షూటింగ్ పూర్తయింది. అయితే హరి హర వీరమల్లు సినిమా మాత్రం ఎప్పుడు వస్తుందని, షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందన్నది మాత్రం తెలియడం లేదు.
సుజిత్‌తో సినిమా అనౌన్స్ చేసిన వెంటనే సెట్స్ మీదకు వెళ్లాడు పవన్ కళ్యాణ్. కానీ క్రిష్, హరీష్ శంకర్ వంటి వారిని మాత్రం ఏళ్లుగా వెయిట్ చేయించాడు. క్రిష్ అయితే తన హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేస్తాడా? లేదా? అన్న అనుమానం అందరిలోనూ నెలకొంది. ఇక హరీష్ శంకర్ సినిమా ఇప్పుడిప్పుడే గాడిన పడింది. మే 11న గ్లింప్స్‌తో అందరినీ ఆశ్చర్యపర్చబోతోన్నారట.
ఇంత లోపు డీవీవీ సంస్థ మాత్రం దూకుడు పెంచేసింది. పవర్ స్టార్ వర్కింగ్ స్టిల్స్‌తోనే హైప్ పెంచేస్తోంది. ఈ హైప్‌తో మేం చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటూ నెటిజన్లు మీమ్స్ వేస్తున్నారు. అలా డీవీవీ సంస్థ తమ ఓజీ సినిమాను వీలైనంతగా ప్రమోట్ చేసుకుంటోంది. తాజాగా మరో ఫోటోను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Also Read: Akhil Agent : నాగ చైతన్య కంటే దారుణంగా అఖిల్.. ఇక సమంత అయితే అంతకు మించి
మిగతా నిర్మాణ సంస్థలు ఇలా పవన్ కళ్యాణ్ క్రేజ్‌ను వాడుకోవడం లేదు. వారి అభిమానులను ఇలా సంతృప్తి పర్చడం లేదు. కానీ డీవీవీ మాత్రం ఆ కిటుకు తెలుసుకుంది. మధ్య మధ్యలో ఇలా పవన్ కళ్యాణ్ క్యాజువల్ పిక్స్‌ను షేర్ చేస్తోంది. ఓజీ మీద అంచనాలు పెంచేస్తోంది. తాజాగా షేర్ చేసిన ఫోటోను చూస్తే ఎంతో సింపుల్‌గానే అనిపిస్తోంది. కానీ ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ విశ్వరూపాన్ని, రేజ్‌ను చూపిస్తామని మాటిస్తున్నామంటూ డీవీవీ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Also Read: Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook