రివ్యూ: ఈగల్
నటీనటులు:రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్, నవదీప్, వినయ్ రాయ్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు..
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, కల్కి, కరమ్ చావ్లా
సంగీతం: దావ్జాంద్
ఎడిటింగ్: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల (పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ)
కథ, దర్శకుడు: కార్తీక్ ఘట్టమనేని


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Eagle movie review: రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఈగల్'. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహంచారు. రవితేజతో 'ధమాకా' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీ నిర్మించడంతో 'ఈగల్' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి అంచనాలను ఈగల మూవీ అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..


'ధమాకా' తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లేని రవితేజ.. తాజాగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో 'ఈగల్' మూవీ చేసాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను 'ఈగల్' మూవీ అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..


ఈగల్ మూవీ కథ విషయానికొస్తే..
 
సహదేవ్ వర్మ (రవితేజ) తలకోన అడవుల్లో పత్తి మిల్లు నడుపుతూ సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. ఈ క్రమంలో అతనికో భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అతని జీవితాన్ని అనుపమ పరమేశ్వర్ లోకానికి పరిచయం చేస్తోంది. దీంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. అసలు సహదేవ్ వర్మ ఎవరు..? అతన్ని పట్టుకోవడానికి ఇంటర్నేషనల్ మాఫియాతో పాటు నక్సలైట్స్, దేశ మిలటరీతో పాటు అంతర్జాతీయ జిహాది ఉగ్ర సంస్థలు ఎందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో హీరో ఎందుకు అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది అనేదే ఈగల్ మూవీ స్టోరీ.


కథనం, టెక్నిషియన్స్ విషయానికొస్తే..


దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని.. సూర్య వర్సెస్ సూర్య తర్వాత పదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత రవితేజతో 'ఈగల్' మూవీని తెరకెక్కించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లిన వాళ్లకు మంచి కిక్ అందిస్తోంది ఈ సినిమా. హై ఎక్స్‌పెక్టేషన్స్ లేని కారణం ఈ సినిమాకు కలిసొచ్చిన అంశమనే చెప్పాలి.ఈ సినిమాను కేజీఎఫ్, సలార్ తరహాలో ఎలివేషన్స్ సీన్స్ నమ్ముకుని తెరకెక్కించాడు. మాస్ ఆడియన్స్‌కు ఈ సీన్స్ కిక్ ఎక్కిస్తాయి. ఇంటర్వెల్ వరకు సోసో అనిపించినా.. ఆ తర్వాత సినిమాను పరిగెత్తించాడు. గత కొన్నేళ్లుగా తెలుగు యాక్షన్ సినిమాల్లో ఎలాంటి కామెడీ ట్రాక్స్ ఉండటం లేదు. కానీ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనీ ఈ సినిమాలో కామెడీ ట్రాక్ పెట్టడం ప్రేక్షకులకు కాస్తంత రిలీఫ్ ఇచ్చే అంశమనే చెప్పాలి. సెకండాఫ్‌లో హీరోయిన్‌తో సన్నివేశాలు ల్యాగ్ అనిపించాన.. ఆ తర్వాత ఎక్కడ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా సినిమాను నడిపించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మొత్తంగ రవితేజ నుంచి ప్రేక్షకులు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ సినిమాలో ఉన్నాయి. చివర్లో ఈ సినిమాకు సెకండ్ పార్ట్ 'ఈగల్.. యుద్ధకాండ' అంటూ సీక్వెల్ ఉందని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు. ఈ సినిమాలో అమ్మవారి గుడి దగ్గర హీరో ఎలివేషన్ సీన్స్ మాస్ ఆడియన్స్ చేత గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ముఖ్యంగా ఆయుధం అనేది సరైన వాడి చేతిలో ఉంటే దేశంతో పాటు ప్రపంచం బాగుంటుంది. అదే చెడ్డవాళ్ల చేతిలో ఉంటే ప్రపంచం నాశనం అవుతుందనే కాన్సెప్ట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఖర్చు పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ పై కనిపిస్తుంది. టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా ఈగల్ మూవీ నిర్మించారు. హై రిచ్ కంటెంట్ డెలీవరీ చేయడంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరోసారి తన సత్తా ఏంటో చూపించింది. ఇక ఈ సినిమాకు ఎడిటర్ కూడా దర్శకుడే కావడంతో ప్లస్ పాయింట్. ఫస్టాఫ్ ల్యాగ్ అయినా.. సెకండాఫ్ ప్రేక్షకులు ఊపిరి బిగపట్టేలా చేసాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.


నటీనటుల విషయానికొస్తే..


రవితేజ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఎలాంటి పాత్ర ఇచ్చినా.. అవలీలాగా చేస్తాడు. అందులో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మరోసారి తనకు ఇచ్చిన పాత్రలో చెలరేగి పోయాడు. ఇక నవదీప్ .. చాలా రోజుల తర్వాత మంచి రోల్ దక్కింది. జర్నలిస్ట్ పాత్రలో నటించిన అనుపమ పరమేశ్వర్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్‌లా నిలిచింది. కావ్య థాపర్, వినయ్ రాయ్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి తమ పరిధి మేరకు నటించారు.


రవితేజ గురించి చెప్పేదేముంది.. కారెక్టర్ ఏదైనా అందులో దూరిపోతాడు. ఈగల్ పాత్రను అలాగే చేసాడు రవితేజ. ఇక నవదీప్‌కు నేనేరాజు నేనేమంత్రి తర్వాత మంచి పాత్ర పడింది. అనుపమ పరమేశ్వరన్ కారెక్టర్ కథను ముందుకు నడిపిస్తుంది. కావ్య తపర్, వినయ్ రాయ్ పాత్రలు చిన్నవే అయినా.. బాగా చేసారు. అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, మిర్చి కిరణ్‌ కామెడీ పర్లేదు. మిగిలిన వాళ్లు ఓకే..


ప్లస్ పాయింట్స్


రవితేజ యాక్షన్ ఎలివేషన్స్


సెకండాఫ్


పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు


మైనస్ పాయింట్స్


ఫస్టాఫ్


పాటలు


లాజిక్ లేని సీన్స్



చివరి మాట: 'ఈగల్‌'.. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టేనర్..


రేటింగ్.. 3/5


Also Read: YSRCP MP Candidates: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే.. మూడో స్థానానికి కూడా పోటీతో ఎన్నికలు రసవత్తరం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter