Evaru Meelo Koteeswarulu: బుల్లితెర తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న షో..'మీలో ఎవరు కోటీశ్వరులు'(Evaru Meelo Koteeswarulu:). ఈ ప్రోగ్రాంకు యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr Ntr) హోస్ట్ గా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. వెండితెరపైనే కాదు...బుల్లితెరపైనే తనదైన మార్కును చూపిస్తున్నాడు జూ.ఎన్టీఆర్. అయితే ఈ షోకు సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh babu) అతిథిగా వస్తున్నట్లు ఇటీవల నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. దానికి సంబంధించిన ప్రోమోను కూడా ఇటీవల రిలీజ్ చేశారు. అయితే ఈ పూర్తి ఎపిసోడ్ డిసెంబర్ 5, రాత్రి 8.30 గంటలకు ప్రసారం కానుంది. ఇలా ఉండగా... తారక్-మహేశ్(Tarak-Mahesh promo) లకు సంబంధించిన మరో ప్రోమోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు నిర్వాహకులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Akhanda movie: మహేష్ బాబు థియేటర్లో అఖండ మూవీ చూసిన Balayya Babu, బోయపాటి శ్రీను


ఈ ప్రోమోలో.. '15న ప్రశ్న ముందు అడిగే వచ్చు కదా అని మహేశ్ అంటే..దానికి ఎన్టీఆర్ చిరునవ్వులు చిందిస్తూ..కోటి ఇచ్చేసి అక్కడ నుంచి తగ్గించుకుంటూ వెయ్యికి రమ్మంటారా అని సెటైర్ వేస్తాడు. వెంటనే కోటి రూపాయలకు సంబంధించిన ప్రశ్న అడుగుతాడు తారక్'. ఇంతటితో ప్రోమో ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో...మహేశ్ నిజంగానే కోటి రూపాయలు గెలిచారా లేదో తెలుసుకోవాలంటే డిసెంబర్ 5 వరకు ఆగాల్సిందే. ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివలతో తారక్ ఎపిసోడ్స్ చేశాడు. 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి