Pawan Kalyan OG: కొద్ది సంవత్సరాల క్రితం వరకు ఇండియా సినిమాలు అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ బాలీవుడ్ అనుకునేవారు. కానీ రాజమౌళి పుణ్యమా అని అది మొత్తం చేంజ్ అయిపోయింది. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా చరిత్ర సృష్టించిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో మన తెలుగు సినిమా ని ఆస్కార్ లెవెల్ కి తీసుకెళ్లాడు. అందుకే ప్రస్తుతం ప్రపంచమంతా సౌత్ ఫిలిం ఇండస్ట్రీ గురించి అది కూడా ముఖ్యంగా టాలీవుడ్ గురించి చర్చ సాగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియన్ సినిమాలు అంటే సౌత్ సైట్ సినిమాలు అన్నంత పేరు వచ్చేసింది. బాలీవుడ్ సినిమాలు వెనుక పడుతూ వచ్చాయి. దీంతో చాలా మంది బాలీవుడ్ సెలబ్రేషన్ తెలుగు సినిమాలను పొగడడం మొదలు పెట్టారు. దీనిపైన ఎన్నో రోజులు సీరియస్ గా చర్చ కూడా జరగడం సాగింది. అయితే ఈమధ్య ఈ వేడి కొంచెం చక్కగా ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ ఓజి సినిమాలో విధంగా చేస్తున్న ప్రముఖ బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హాసిని తెలుగు సినిమాలను మెచ్చుకొని మరోసారి హిందీ వర్గాన్ని హర్ట్ అయ్యేలా చేశారు.


సుజిత్ దర్శకత్వంలో  పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ లో  బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి విలన్ గా కనిపించబోతున్నారు. ఆల్రెడీ ఇమ్రాన్ కి సంబంధించి చాలా వరకు OG షూట్ అయిపోయినట్లు సినీ వర్గాల్లో టాప్ నడిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సౌత్ సినిమా చేస్తున్నందుకు.. మీడియా వారు సౌత్ – బాలీవుడ్ మధ్య తేడా ఏంటి అని అడిగారు. అందరూ ఇమ్రాన్ బాలీవుడ్ సినిమాలను మెచ్చుకుంటారు అని అనుకుంటూ ఉండగా ఆయన తెలుగు సినిమాలను ప్రశంసిస్తూ షాక్ కి గురి చేశారు.


“సౌత్ ఫిలిం మేకర్స్ బాలీవుడ్ వారి కన్నా కూడా చాలా క్రమశిక్షణగా ఉంటారు. బాలీవుడ్ లో సినిమా విషయాల్లో డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. కొన్ని సార్లు అవసరం లేని చోట కూడా ఖర్చు పెడతారు. కానీ సౌత్ వారు అలా కాదు. వారు ఖర్చు పెట్టే దాంట్లో  ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. ఖర్చు చేసిన డబ్బులు సినిమా రూపంలో కనిపిస్తాయి. VFX, పాత్ బ్రేకింగ్ కథల విషయంలో సౌత్ దర్శకులు మనకంటే ముందు ఉన్నారు’ అంటూ ప్రశంసించారు. దీంతో ఇమ్రాన్ హష్మీ కామెంట్స్ ప్రస్తుతం అటు బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోను వైరల్ గా మారాయి.


Also Read: Chalo Nalgonda: రెచ్చిపోయిన కాంగ్రెస్‌ కార్యకర్తలు.. కేటీఆర్‌, హరీశ్ రావు బస్సుపై కోడిగుడ్లతో దాడి


Also Read: KTR Viral Tweet: శభాష్‌ బావ.. అసెంబ్లీలో దుమ్ము దులిపిన హరీశ్ రావుకు కేటీఆర్‌ ప్రశంసలు



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook