Tollywood Drugs Case: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కలకలం రేపిన డ్రగ్స్ కేసు మరోసారి సంచలనం కల్గిస్తోంది. సినీ ప్రముఖుల చుట్టూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగిస్తున్నట్టు కన్పిస్తోంది. తాజాగా సినీ ప్రముఖుల్ని విచారిస్తూ నోటీసులు పంపిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం(Tollywood Drugs Case) ఎంతగా కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడీ కేసు మరోసారి తెరపైకొచ్చింది. ఈసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగింది. సినీ ప్రముఖుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే ఇదే కేసుకు సంబంధించి ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాధ్‌ను ఈడీ విచారించింది. దాదాపు 10 గంటలకు పైగా ప్రశ్నించిన ఈడీ అధికారులు.. మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై పూరి జగన్నాథ్‌ను(Puri Jagannadh) ప్రశ్నించారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. విదేశాల్నించి డ్రగ్స్ కొనుగోళ్లు ఏ రూపంలో ఎలా జరిగాయనే వివరాలు అడిగారు. పూరీ జగన్నాథ్‌కు సంబంధించి మూడు బ్యాంకు ఎక్కౌంట్లను పరిశీలించారు. ఈ కేసులో గతంలో అరెస్టైన నిందితుల వాంగ్మూలం ఆధారంగా పూరి జగన్నాథ్‌ను ప్రశ్నించిని ఈడీ.. స్టేట్‌మెంట్‌ను లిఖిత పూర్వకంగా నమోదు చేసింది.


తాజాగా ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్‌ను(Rakul Preeth Singh) విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు పంపింది. రకుల్ ప్రీత్‌సింగ్ సెప్టెంబర్ 6వ తేదీన ఈడీ విచారణకు హాజరుకావల్సి ఉంది. రకుల్ హాజరుపై సందిగ్దత కొనసాగుతోంది. అనివార్య కారణాల వల్ల తాను ఆ తేదీన విచారణకు హాజరుకాలేనని రకుల్ తెలిపింది. మరోరోజు విచారణకు హాజరవుతానని ఈడీనీ కోరింది. అయితే ఇప్పటి వరకూ ఎక్సైజ్ విచారణలో రకుల్ పేరు లేకపోవడం విశేషం. కానీ ఈడీ (ED)మాత్రం ఈ కేసుతో రకుల్ ప్రీత్‌సింగ్‌కు సంబంధాలున్నట్టు గుర్తించింది. మరోవైపు టాలీవుడ్ నటి ఛార్మిని ఈడీ విచారిస్తోంది. కెల్విన్ స్టేట్‌మెంట్ ఆధారంగా ఈడీని విచారిస్తోంది. ఛార్మి (Charmi)విచారణ సందర్భంగా ఈడీ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటైంది. రానున్న రోజుల్లో చాలామంది టాలీవుడ్ ప్రముఖులు ఈడీ విచారణను ఎదుర్కోనున్నారని తెలుస్తోంది. 


Also read:Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్‌ను విచారించిన ఈడీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook