Every Girl Needs Individuality Maruthi Payal Eesha Purnaas 3 Roses Trailer out now: తెలుగు ఓటీటీ కోసం 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ రూపొందుతోంది. పాయల్ రాజ్ పుత్ ,ఈషా రెబ్బా , పూర్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే 3 రోజెస్ (3 Roses) నుంచి ఫస్ట్ లుక్, హీరోయిన్ల క్యారక్టర్ పోస్టర్స్, టీజ‌ర్ రిలీజ్‌ అయ్యాయి. నవంబర్ 12న ఈ సిరీస్‌ ఆహా లో (Aha) ప్రీమియర్ గా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదైన 3 రోజెస్ ట్రైల‌ర్ (3 roses trailer) ఆకట్టుకుంటోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ట్రైలర్ ను హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రిలీజ్ చేశారు. రీతూ, జాన్వీ, ఇందు అనే ముగ్గురు ఈ తరం అమ్మాయిల జీవితాల కథలే 3 రోజెస్ వెబ్ సిరీస్ (3 Roses Web Series). వేరే వ్యక్తి నీడలో ఎందుకు బతకాలి.. మాకు ఫుల్ ఫ్రీడమ్ కావాలి అనుకునే ఈ ముగ్గురి యువతుల పెళ్లి చుట్టూ జరిగిన సంఘటనలను ఈ వెబ్ సీరిస్‌లో చూపించనున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా (Romantic Comedy Entertainer) వెబ్ సిరీస్ ఉంటుందని ట్రైల‌ర్ చూస్తే అర్ధ‌మ‌వుతోంది.


Also Read : Special Video from Ghani:ఆకట్టుకుంటున్న 'గని' సినిమా స్పెషల్ వీడియో..ఈ నెల 15న టీజర్


ఇక ట్రైల‌ర్ లో (Trailer) నేను పెద్దమనిషి అయినప్పుడు అది ఇంకా స్కూల్‌లో కూడా జాయినై ఉండదు.. ఇప్పుడు దానికి కూడా పెళ్లి అయిపోతుంది.. నాకెప్పుడు అవుతుందో ఏంటో అంటూ అసహనం వ్యక్తం చేస్తోంది పూర్ణ (Purnaa). మగ్గీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. 30 సంవత్సరాలు వయసు వచ్చినా పెళ్లి కానీ అమ్మాయిగా పూర్ణ.. అందమైన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకునే పాత్రలో ఈషా.. ట్రెక్కింగ్‌పై (Trekking‌) ఆసక్తి కనబరిచే అమ్మాయిగా పాయల్‌ (Payal‌) ఈ సీరిస్‌ లో కనిపించనున్నారు. అలాగే ఫ్రీడమ్ (Freedom) కోసం పాకులాడే ఈ అమ్మాయిల కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందనే విషయం తెలియాలంటే 3 రోజెస్‌ (3 Roses) చూడాలి.



Also Read : Gold Smuggling: శానిటరీ ప్యాడ్స్ లో గోల్డ్ స్మగ్లింగ్.. ఎయిర్ ఇండియా ఎంప్లాయ్ అరెస్టు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి