Koratala siva: ఆచార్య దెబ్బ.. కొరటాల ఆఫీస్ ముందు ఎగ్జిబిటర్ల భైఠాయింపు.. నెక్స్ట్ చిరునే అంటూ!
Tension at Koratala siva Office: సుమారు డిస్ట్రిబ్యూటర్లు 15 నుంచి 25 మంది కొరటాల శివ ఆఫీస్ దగ్గర భైఠాయించారని తెలుస్తోంది. ఆచార సెటిల్మెంట్ వ్యవహారంలోనే ఇది జరిగిందని అంటున్నారు.
High Tension at Koratala siva Office: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ ప్రధాన పాత్రలో కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య సినిమా మార్చ్ 29వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడి భారీ డిజాస్టర్ గా నిలిచింది. తెలుగు సినీ చరిత్రలో భారీ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు కొరటాల శివకు తలనొప్పులు తెచ్చిపెడుతోందని అంటున్నారు. నిజానికి ఈ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి కేవలం డబ్బులు పెట్టేందుకు మాత్రమే పరిమితం అయ్యారని, నిర్మాణ కార్యక్రమాలు కూడా కొరటాల శివ దగ్గరుండి చూసుకున్నారని అంటూ ఉంటారు.
తొలుత ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా ప్రారంభించారు. కానీ రామ్ చరణ్ పూర్తిగా నిర్మాణ బాధ్యతలు మాట్నీ ఎంటర్టైన్మెంట్ నిరంజన్ రెడ్డి మీద వదిలేశారు. ఆయన కొరటాల శివ మీద నమ్మకంతో అన్ని బాధ్యతలు కొరటాల శివకు అప్పగించారు. కొరటాల శివ కూడా దాదాపుగా అన్ని బాధ్యతలు జాగ్రత్తగా నిర్వర్తిస్తూ వచ్చారు. కానీ సినిమా రిజల్ట్ తేడా పడటంతో ఇప్పుడు అసలు కథ మొదటికి వచ్చింది. అదేమంటే సినిమా హక్కులు అమ్మే సమయంలో కూడా కొరటాల శివ డైరెక్టుగా డిస్ట్రిబ్యూటర్లతో రేట్లు ఫైనల్ చేశారని అంటున్నారు.
ఇప్పుడు భారీగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు కొరటాల శివతోనే సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. కొద్ది రోజులుగా ఈ వార్తలు వస్తునే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కొందరు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు, తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు కూడా తమ వ్యవహారం తేల్చాలని కొరటాల శివను కోరినట్లు సమాచారం. సుమారు డిస్ట్రిబ్యూటర్లు 15 నుంచి 25 మంది కొరటాల శివ ఆఫీస్ దగ్గర భైఠాయించారని తెలుస్తోంది. ఈ విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. మీరు ఏమైనా చేయగలిగితే చేయండి లేకపోతే చేయలేము అని చెప్పేస్తే చిరంజీవి గారితో తేల్చుకుంటామని వారంతా కొరటాల దగ్గర వాపోతున్నట్లు సమాచారం.
అయితే డిస్ట్రిబ్యూషన్ వ్యవహారం మొదటి నుంచి తానే చూస్తున్నాను కాబట్టి తానే క్లోజ్ చేయడానికి కొరటాల శివ ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన వల్ల కాకుంటే చిరంజీవి ఇంటి బయట భైఠాయిస్తామని హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయో తెలియదు గానీ సోషల్ మీడియాలో మొదలైన ఈ ప్రచారం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
Also Read: Pelli SandaD: వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రంగం సిద్దం.. ఏ రోజు టెలీకాస్ట్ అంటే?
Also Read: Supermoon: వినీలాకాశంలో అరుదైన అద్భుతం.. భూమికి దగ్గరగా కనువిందు చేయనున్న సూపర్ మూన్
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook