Pelli SandaD: వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రంగం సిద్దం.. ఏ రోజు టెలీకాస్ట్ అవుతుందంటే?

Pelli SandaD Television Premier :  పెళ్లి సందD సినిమాను జూలై 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంటే ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయడానికి జీ తెలుగు రంగం సిద్ధం చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 13, 2022, 01:51 PM IST
  • రోషన్ శ్రీ లీల జంటగా పెళ్లి సందD
  • జీ 5 లో స్ట్రీం అవుతున్న పెళ్లి సందD
  • జీ తెలుగులో అలరించడానికి రంగం సిద్దం
 Pelli SandaD: వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రంగం సిద్దం.. ఏ రోజు టెలీకాస్ట్ అవుతుందంటే?

Pelli SandaD Movie Television Premier on July 17th: ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయమైన తాజా చిత్రం పెళ్లి సందD. శ్రీకాంత్ హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ అందుకున్న పెళ్లి సందడి సినిమా టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏడాది థియేటర్లలో విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. రాఘవేంద్రరావు మొట్టమొదటిసారి తెరమీద కనిపించిన ఈ సినిమాకు ఆయన శిష్యురాలు గౌరీ రోణంకి దర్శకత్వం వహించారు. సినిమా థియేటర్లలో విడుదలై వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఎదురు చూశారు.

ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందని ఎదురుచూసిన అందరికీ జీ 5 ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించి ప్రస్తుతం ఆ సినిమాను జీ5 ఓటీటీ స్ట్రీమ్ చేస్తోంది. అయితే ఈ సినిమాను ఎప్పుడెప్పుడు టీవీల్లో చూస్తామా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులందరికీ జీతెలుగు ఒక శుభవార్త చెప్పింది. ఈ సినిమాను జూలై 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంటే ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఈ సినిమాలో రోషన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా నటించగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు,  రాజేంద్రప్రసాద్,  ప్రకాష్ రాజ్,  తనికెళ్ల భరణి,  పోసాని కృష్ణ మురళి,  షకలక శంకర్,  రఘుబాబు వంటి వారు ఇతర కీలక పాత్రలలో కనిపించారు.

వశిష్ట అనే పాత్రలో యంగ్ వశిష్టగా రోషన్ వయసు పైబడిన వశిష్టగా రాఘవేంద్రరావు నటించారు. ఇక విధి కంటే సంకల్ప శక్తే గొప్పదని నమ్మి తన ప్రేయసిని ఎలా దక్కించుకున్నారు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. సినిమా కోసం ఎంఎం కీరవాణి అందించిన సంగీతం శ్రోతలను ఆకట్టుకోగా కలర్ఫుల్ విజువల్స్ తో ఫుల్ ఫ్యామిలీ హ్యాపీగా చూడగలిగే ఈ సినిమా జూలై 17వ తేదీన మీ జీ తెలుగులో ప్రసారమవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం కుటుంబ సమేతంగా వీక్షించడానికి సిద్ధం కండి.

Read Also: Vijay Devarakonda: దేవరకొండతో డేటింగ్ చేయలనుందన్న సారా.. విజయ్ షాకింగ్ రిప్లై!

Read Also: Vikram: ముఖాలు మార్ఫ్ చేసి ప్రచారం చేశారు.. వారిపై విక్రమ్ అసహనం!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x