Sadha instead of indraja : ఇంద్రజ అవుట్ సదా ఇన్.. కొత్త జడ్జ్‌తో కళకళ
Jabardasth New Judge జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ వంటి వినోదాత్మక షోలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ షోలకు మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుంటుంది. అయితే మల్లెమాల, జబర్దస్త్ వంటి షోలో మీద ఎన్నెన్నో విమర్శలు వస్తుంటాయన్న సంగతి తెలిసిందే.
Extra Jabardasth New Judge ఎక్స్ ట్రా జబర్దస్త్, జబర్దస్త్ వంటి షోలు బుల్లితెరపై మంచి టీఆర్పీలు సాధిస్తుంటాయి. అయితే మల్లెమాల నుంచి వచ్చే ఈ షోల మీద ఎప్పుడూ విమర్శలు వస్తూనే ఉంటాయి. ఆర్టిస్టులు వెళ్తుంటారు. వస్తుంటారు. యాంకర్లు, జడ్జ్‌లు వస్తుంటారు, మారుతుంటారు. ఇన్ని రోజులకు కృష్ణ భగవాన్, ఇంద్రజల కాంబోకు జనాలు అలవాటు పడ్డారు. అంతకు ముందు నాగబాబు, రోజాల కాంబోను జనాలు ఇష్టపడ్డారు.
అయితే నాగబాబు కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చాడు. వేరే చానెల్స్‌లో షోలు ప్లాన్ చేశాడు. చివరకు నాగబాబు బుల్లితెరకు దూరం అయ్యాడు. ఇక రోజా తనకు మంత్రి పదవి రావడంతో బుల్లితెరకు దూరమైంది. అయితే ఇప్పుడు బుల్లితెరపై కృష్ణ భగవాన్, ఇంద్రజలు బాగానే సెట్ అయ్యారు. శ్రీదేవీ డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోలు, ఢీ ఇలా అన్నింట్లోనూ జడ్జ్‌లు బాగానే సందడి చేస్తున్నారు. సదా అయితే ఇంతకు ముందు ఢీ షోకు జడ్జ్‌గా వ్యవహరించింది.
ఇప్పుడు ఇంద్రజ, కృష్ణ భగవాన్‌లు బుల్లితెరపై షోలు చేసుకుంటూ సింక్‌తో వెళ్తున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ సడెన్‌గా ఇంద్రజను తీసేసినట్టుగా కనిపిస్తోంది. అసలే ఇప్పుడు రష్మీ, ఇంద్రజలే అన్ని షోలో కనిపిస్తున్నారు. శ్రీదేవీ డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోల్లో ఇంద్రజ జడ్జ్‌గా ఉంటోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇంద్రజ స్థానంలో కొత్త యాంకర్‌ను పట్టుకొచ్చారు. సదా కొత్త యాంకర్‌గా ఎక్స్ ట్రా జబర్దస్త్ టీం ఫిక్స్ చేసినట్టుంది.
Also Read: Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్.. మా రాఘవుడి కథే రామాయణం.. ఆ ఒక్కటే మైనస్
సదా ఇది వరకు ఢీ షోలో జడ్జ్‌గా చేసిన సంగతి తెలిసిందే. అయితే మళ్లి ఇన్ని రోజులకు ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు వచ్చింది. ఇంద్రజకు వేరే పని పడటం వల్ల, అందుబాటులో లేకపోవడం వల్ల ఇలా సదాను పట్టుకొచ్చారా? లేదంటే ఇకపై సదాను కంటిన్యూ చేస్తారా? అన్నది తెలియడం లేదు. అయితే ఇంద్రజ జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook