Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్.. మా రాఘవుడి కథే రామాయణం.. ఆ ఒక్కటే మైనస్

Adipurush Official Trailer Released: రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జంటగా నటించిన మూవీ ఆదిపురుష్. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుండగా.. మంగళవారం మూవీ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.   

Written by - Ashok Krindinti | Last Updated : May 9, 2023, 02:43 PM IST
Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్.. మా రాఘవుడి కథే రామాయణం.. ఆ ఒక్కటే మైనస్

Adipurush Official Trailer Released: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆదిపురుష్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఓం రౌత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైథలాజికల్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో రాఘవుడి పాత్రలో ప్రభాస్ యాక్ట్ చేయగా.. జానకి పాత్రలో కృతి సనన్ కనిపించనుంది.

లంకేశ్వరుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ నటించాడు. పాన్ ఇండియా లెవల్లో జూన్ 16వ తేదీన ఐదు భాషల్లో ఆదిపురుష్ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్స్, టీజర్‌కు అభిమానుల నుంచి భారీ రెస్పార్స్ రాగా.. తాజాగా రిలీజ్‌ అయిన ట్రైలర్ అంతకుమించి ట్రెండిగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది నా రాముడి కథ అంటూ వాయిస్`ఓవర్‌తో మొదలుపెట్టారు. 'ఆయన మనిషిగా పుట్టిన భగవంతుడు అయిన మహనీయుడు. ఆయన జీవితం ధర్మానికి, సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రామనామం.. ఆయన ధర్మం.. అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘనందుడి ఘనత. యుగయుగాల్లోనూ సజీవం. జాగృతం. మా రాఘవుడి కథే రామయణం..' అంటూ ట్రైలర్‌ను పరిచయం చేశారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News