Fact Behind Harihara Veeramallu Producer Change: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు రాజకీయాల మాత్రమే చేస్తాను అని ప్రకటించిన ఆయన రాజకీయరంగంలో విఫలం కావడంతో మళ్ళీ సినిమాలు చేస్తున్నారు. అలా రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  ఆ తర్వాత ఆయన వరుస సినిమాలను లైన్లో పెట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందులో దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సబ్జెక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణలోని ఒక బందిపోటు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని ప్రచారం ముందు నుంచి జరుగుతోంది. తెలంగాణ రాబిన్ హుడ్ గా పేరు పొందిన పండుగల సాయన్న అనే ఆయన జీవిత కథ నేపథ్యంలోనే సినిమా సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ముందు నుంచి కూడా ఈ సినిమాను నిర్మాత ఏం రత్నం నిర్మిస్తున్నారనే ప్రచారం జరిగింది.


కానీ అనూహ్యంగా తాజాగా సినిమా యూనిట్ నుంచి విడుదలైన ప్రకటనలో మాత్రం నిర్మాత ఏ దయాకర్ రావు అని పేర్కొన్నారు. కొన్నాళ్ల నుంచి ఈ సినిమా నిర్మాత ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారని సినిమా నిలిపివేసే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయని ప్రచారం జరిగింది. దీంతో నిర్మాతగా ఏఎం రత్నం తప్పుకుని దయాకర్ రావు అనే ఆయనకు సినిమా అప్పగించారని తాజాగా ప్రచారం జరుగుతుంది. కానీ అసలు విషయం ఏమిటంటే దయాకర్ రావు మరెవరో కాదు ఏం రత్నం సొంత సోదరుడే. అంటే ఏం రత్నం ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తూ ఉండగా ఆయన సోదరుడు దయాకర్ రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


నిజానికి దయాకర్ రావు ముందు నుంచి కూడా సినిమాలో నిర్మాతగా భాగమయ్యారు. కానీ ఎందుకో ఆయన పేరు ఎక్కువగా హైలైట్ అవ్వలేదు. ఇప్పుడు దయాకర్ రావు పేరు తెర మీదకు రావడంతో సినిమా నుంచి తప్పుకున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఇక పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేందుకు హరిహర వీరమల్లు సినిమా యూనిట్స్ సిద్ధమైంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. 


Also Read: Telugu Film Chamber Of Commerce: హీరోయిన్ల దెబ్బకు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్న తెలుగు ఫిలిం ఛాంబర్


Also Read: Kapil Sharma New Project: పుష్ప హీరోయిన్‌తో కలిసి నటించనున్న కపిల్ శర్మ, బాలీవుడ్‌లో ఇదే చర్చ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి