Kapil Sharma New Project: పుష్ప హీరోయిన్‌తో కలిసి నటించనున్న కపిల్ శర్మ, బాలీవుడ్‌లో ఇదే చర్చ

Kapil Sharma New Project: ప్రముఖ టెలివిజన్ కామెడి షో హోస్ట్ కపిల్ శర్మ త్వరలో పుష్ప హీరోయిన్ రష్మిక మందన్నాతో సినిమా చేస్తున్నాడా..బాలీవుడ్‌లో, సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే చర్చ రేగుతోంది. అటు కపిల్ అభిమానులు కూడా సందిగ్దంలో పడ్డారు. అసలేం జరిగింది..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 1, 2022, 11:35 PM IST
Kapil Sharma New Project: పుష్ప హీరోయిన్‌తో కలిసి నటించనున్న కపిల్ శర్మ, బాలీవుడ్‌లో ఇదే చర్చ

Kapil Sharma New Project: ప్రముఖ టెలివిజన్ కామెడి షో హోస్ట్ కపిల్ శర్మ త్వరలో పుష్ప హీరోయిన్ రష్మిక మందన్నాతో సినిమా చేస్తున్నాడా..బాలీవుడ్‌లో, సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే చర్చ రేగుతోంది. అటు కపిల్ అభిమానులు కూడా సందిగ్దంలో పడ్డారు. అసలేం జరిగింది..

కపిల్ శర్మ షో త్వరలోనే ప్రారంభమౌతుందనగా..తాజాగా కొత్త ప్రాజెక్టు ప్రకటించాడు.  కపిల్ చేసిన ఈ ప్రకటన అతడి ఫ్యాన్స్‌ను సందిగ్దంలో పడేసింది. కపిల్ శర్మ..నందితా దాస్ సినిమా కాకుండా మరో సినిమాకు సైన్ చేశాడనే వార్తలు వైరల్ అయ్యాయి. ఆ సినిమాలో పుష్ప సినిమా హీరోయిన్ రష్మిక మందన్నాతో కపిల్ శర్మ నటించనున్నాడా అనే సందేహాలు వస్తున్నాయి. బాలీవుడ్ కొత్త సూపర్ స్టార్‌గా కపిల్ శర్మ అవతరించనున్నారా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. తన కొత్త ప్రాజెక్టు ప్రకటిస్తూ కపిల్ శర్మ విడుదల చేసిన పోస్ట్ అభిమానుల్ని మరింత సందిగ్దానికి లోను చేసింది. 

కపిల్ శర్మ విడుదల చేసిన ఒక ఫోటోలో మెగా బ్లాక్ బస్టర్ అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో రాసి..కపిల్ శర్మ ఫోటో ఉంది. దిగువన సెప్టెంబర్ 4న ట్రైలర్ రిలీజ్ అని రాసుంది. ఈ పోస్టర్ చూసి అందరూ ఆల్ ది బెస్ట్, విషెస్ చెబుతున్నారు. కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ పోస్టర్‌పై ఆసక్తి కనబరిచారు. అదే సమయంలో ఇదే ప్రాజెక్టుకు సంబంధించి..పుష్ప హీరోయిన్ రష్మిక మందన్నా కూడా పోస్ట్ షేర్ చేసింది. అందులో కూడా తన ఫోటోతో మెగా బ్లాక్ బస్టర్ అని రాసుంది. ఈ రెండు పోస్టర్లు ఒకేలా ఉండటంతో..కపిల్ శర్మ, రష్మిక మందన్నాల కొత్త సినిమా రానుందనే వార్త హల్‌చల్ అయింది.

అసలేమైంది..

వాస్తవానికి ఇదే ఫోటోను రష్మికా మందన్నాతో పాటు త్రిషా కృష్ణన్, క్రికెటర్ రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ ఫోటోలతో కూడా షేర్ అయ్యాయి. అంటే ఇదంతా కపిల్ శర్మ కొత్త షో క్యాంపెయిన్‌లో భాగమని తరువాత ఆలస్యంగా అర్ధమైంది. ఏదేమైనా ఈ విషయంపై మరింత క్లారిటీ సెప్టెంబర్ 4 న విడుదల కానున్న ట్రైలర్‌తోనే వస్తుంది. 

Also read: KWK 7: విమానంలో సెక్స్‌కు ప్రయత్నించి..పట్టుబడి పోయిన కరణ్ జోహార్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News