Keerthy Suresh Marriage With Childhood Friend: అలనాటి నటి మేనక కుమార్తె ఆయన కీర్తి సురేష్ బాలనటిగానే మలయాళ సినిమాల్లో కనిపించింది. తర్వాత గీతాంజలి అనే మలయాళ సినిమాతో హీరోయిన్గా మారింది. అయినా సరే మలయాళ సినీ పరిశ్రమలో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ తెలుగులో ఆమెకు అవకాశాలు లభించాయి, ముందుగా చేసిన సినిమా రిలీజ్ అవ్వకపోయినా తర్వాత చేసిన సినిమా నేను శైలజతోనే ఆమె సూపర్ హిట్ అందుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదటి సినిమానే హిట్ కావడంతో ఆమెకు గోల్డెన్ లెగ్ అనే పేరు పడింది. దీంతో అతి తక్కువ సమయంలోనే ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. అదృష్టమా దురదృష్టమో ఆమె చేసిన మహానటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు వరుసగా లేడీ ఓరియెంటెడ్ పాత్ర ఉన్న సినిమాలే దక్కాయి. అయితే మహానటి సినిమా తర్వాత ఆమె పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆమె చేసిన దాదాపు అన్ని లేడీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతూ వచ్చాయి.


ఈ మధ్యనే మళ్లీ గ్లామర్ పాత్రల వైపు చూస్తూ గ్లామర్ విషయంలో కూడా ఏ మాత్రం వెనకడుగు వేసేది లేదంటూ దూసుకుపోతోంది. అయితే తాజాగా ఆమె పెళ్లి గురించి సోషల్ మీడియాలో మీడియాలో అనేక చర్చలు జరుగుతున్నాయి. ఆమె తన చిన్ననాటి క్లాస్మేట్ తో రిలేషన్ లో ఉన్నట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. వీరిద్దరి వివాహానికి సైతం తల్లిదండ్రులు ఒకే చెప్పారని, వీరిద్దరూ దాదాపు 13 ఏళ్లుగా రిలేషన్షిప్లో కొనసాగిస్తున్నారని ఇలా రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి.


కీర్తి సురేష్ క్లాస్మేట్ కేరళలోని ఒక రిసార్ట్ యజమాని అని త్వరలోనే వీరు పెళ్లి గురించి అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ విషయాలను కీర్తి సురేష్ తల్లి మేనక సురేష్ ఖండించారు. అసలు కీర్తి సురేష్ పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారం అంతా నిజం కాదని తన కూతురు తరపున తాను వాటిని ఖండిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం మీద కీర్తి సురేష్ సైతం స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఆమె ఏ వేదికగా స్పందించారనే విషయం మీద క్లారిటీ లేదు.


తనకు ప్రేమ పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారంలో నిజంగా లేదని తనకి ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఆమె తేల్చి చెప్పినట్లుగా ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఆమె తెలుగులో కొన్ని హాట్ సినిమాలు చేస్తోంది. నాని సరసన కీర్తి సురేష్ దసరా అనే సినిమాలో నటిస్తోంది, అలాగే మెగాస్టార్ చిరంజీవిగా భోళాశంకర్ అనే సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే తమిళంలో ఆమె ఉదయనిధి స్టాలిన్ సరసన హీరోయిన్గా నటించిన ఒక సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే విడుదలకు రంగం సిద్ధమవుతోంది. అలాగే హీరో విజయ్ ప్రొడక్షన్ మేనేజర్ నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న రివాల్వర్ రీటా అనే సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. అందుకే విజయ్ తో కూడా ఆమె ప్రేమలో ఉన్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రచారాలు జరిగాయి. అయితే అది నిజం కాదని తెలుస్తోంది.
Also Read: Nani's Dasara Teaser Talk:నీయవ్వ గెట్లైతే గట్లే..గుండు గు**లో లేపేద్దాం.. నాని నోట బూతు మాట!


Also Read: Keerthy Suresh: దసరా టీజర్లో కీర్తి సురేష్ లేదేంటి? అసలేమైందబ్బా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook