Keerthy Suresh: దసరా టీజర్లో కీర్తి సురేష్ లేదేంటి? అసలేమైందబ్బా?

Keerthy Suresh Missing : నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో దసరా అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే, తాజాగా ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అవగా హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ టీజర్లో ఎక్కడా కనిపించలేదు.

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 30, 2023, 06:26 PM IST
Keerthy Suresh: దసరా టీజర్లో కీర్తి సురేష్ లేదేంటి? అసలేమైందబ్బా?

Keerthy Suresh Missing in Dasara Teaser: నాని హీరోగా దసరా అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే, శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా రిలీజ్ అయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ టీజర్లో ఎక్కడా కనిపించలేదు.

నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమా మీద ప్రకటించిన వాటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. మొట్ట మొదటి సారిగా నాని పూర్తిస్థాయిలో తెలంగాణ యాసలో మాట్లాడడమే కాదు ఒక రా అండ్ రస్టిక్ గెటప్ లో కూడా కనిపిస్తూ ఉండడంతో ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని అందరూ అనేక సందేహాలతో ఉన్నారు. అయితే ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో సినిమా వేరే లెవెల్ లో ఉంటుందని నాని అభిమానులు మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు సైతం కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ సందర్భంగా నిమిషం 15 సెకండ్ల పాటు సాగిన టీజర్లో ఎక్కడా కీర్తి సురేష్ కనిపించకపోవడం గమనార్హం. ఈ సినిమాలో నాని ధరణి అనే వ్యక్తి పాత్రలో నటిస్తుండగా కీర్తి సురేష్ వెన్నెల అనే యువతి పాత్రలో నటిస్తోంది. అయితే ఈ టీజర్ లో ప్రతి నాయకుడు అని భావిస్తున్న మలయాళం నటుడు షైన్ చాకో విజువల్స్ కూడా ఉన్నాయి కానీ హీరోయిన్ అని చెబుతున్న కీర్తి సురేష్ విజువల్ లేకపోవడంతో అసలు ఎందుకు ఆమె విజువల్స్ కనిపించడం లేదని చర్చ జరుగుతూ ఉంది.

అయితే కీర్తి సురేష్ కోసం స్పెషల్ టీజర్ ఏమైనా ప్లాన్ చేశారా అని చెప్పి కూడా ఇప్పుడు రూపొందుతోంది. నాని ఎలా అయితే పూర్తిస్థాయి రా అండ్ రస్టిక్ అవతార్లో కనిపిస్తున్నాడు, కీర్తి సురేష్ కూడా అదే విధంగా సరికొత్త రూపంలో కనిపించబోతుంది అనే ప్రచారం జరుగుతోంది. ఇక మునుపెన్నడూ కనిపించని పాత్రలో ఆమె దర్శనం ఇవ్వబోతుందని దాన్ని అంత ఈజీగా వదిలేస్తే సినిమాకి వచ్చే క్రేజ్ కొంత మిస్ అవుతామని అంటున్నారు. అందుకే ఆమెకు సపరేట్గా టీజర్ ప్లాన్ చేసి ఉంటారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం మీద అధికారికంగా ఒక క్లారిటీ ఇస్తే తప్ప ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అనే విషయం మీద అవగాహన రావడం కష్టమే.
Also Read: Pawan Kalyan Unstoppable: పవన్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ వచ్చేస్తోంది.. ఆరోజునే ప్రేక్షకుల ముందుకు!

Also Read: Nani's Dasara Teaser Talk:నీయవ్వ గెట్లైతే గట్లే..గుండు గు**లో లేపేద్దాం.. నాని నోట బూతు మాట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News