Did Music director Thaman out of Mahesh Babu – Trivikram’s film: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 28వ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు సర్కారు వారి పాట సూపర్ హిట్ అందుకున్న తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమా ప్రకటించిన భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఎందుకో ఏమో తెలియదు కానీ ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా మీద అనేక గాసిప్స్, రూమర్లు తెరమీదకు వస్తూనే ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా స్క్రిప్ట్ నచ్చక మహేష్ బాబు స్క్రిప్ట్ మార్చమన్నాడని ఒకసారి వచ్చిన షూటింగ్ అవుట్ ఫుట్ బాలేదని భావించి మళ్లీ రీషుట్లు చేస్తున్నారని మరోసారి ఇలా ఎప్పటికప్పుడు ప్రచారం తెరమీదకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్గా థమన్ ను తప్పించినట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ సినిమాకి థమన్ ని మ్యూజిక్ డైరెక్టర్గా చేయడం మహేష్ అభిమానులు ఎవరికి ఇష్టం లేదు.


Also Read: Malli Pelli Movie Review: నరేష్-పవిత్రాల మళ్లీ పెళ్లి రివ్యూ అండ్ రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?


మహేష్ కూడా థమన్ అవుట్పుట్ వల్ల ఏమాత్రం ఆసక్తికరంగా లేకపోవడంతో ఆయన్ని తప్పించాలని ముందు నుంచి ప్రెషర్ పెడుతున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పటివరకు థమన్ ను వెనకేసుకొచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు థమన్ వ్యవహార శైలితో విసిగిపోయాడని ఆయనను తప్పించి వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని రంగంలోకి దించాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అనిరుధ్ రవిచందర్ తో సినిమా చేయించాలని భావిస్తున్నారు.


కానీ ఆయన డేట్లు ఏమాత్రం ఖాళీగా లేవు. ఈ నేపథ్యంలో జీవి ప్రకాష్ కుమార్ తో పని కానివ్వాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది, అయితే ఈ ప్రచారం నిజం కాదని అంటున్నారు. థమన్ తో సినిమా యూనిట్ కి ఎలాంటి ఇబ్బంది లేదని 31వ తేదీ రిలీజ్ కాబోతున్న గ్లింప్స్ కి సంబంధించిన మ్యూజిక్ కూడా థమన్ పంపించి వేశాడని అంటున్నారు. థమన్ గురించి జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమని ఆయన కచ్చితంగా సినిమాకి పనిచేస్తారని తెలుస్తోంది. చూడాలి ఇందులో ఎంతవరకు నిజా నిజాలు ఉన్నాయి చివరికి ఏం జరగబోతుంది అనేది. 


Also Read: Dimple Hayathi Boyfriend : డీసీపీతో గొడవ.. బాయ్ ఫ్రెండ్ సీక్రెట్లు లీక్.. హర్ట్ అయిన డింపుల్ హయతి 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK