Salman Khan Secret Marriage: బాలీవుడ్ కండల వీరుడు, భజరంగి భాయిజాన్ సల్మాన్ ఖాన్ పెళ్లి విషయంపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తాజాగా సల్మాన్ పెళ్లిపై మరో రూమర్ తెర పైకి వచ్చింది. హీరోయిన్ సోనాక్షి సిన్హాను సల్మాన్ ఖాన్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ ప్రచారమవుతున్నాయి. అయితే ఇందులో నిజమెంత... నిజంగానే సల్మాన్ సోనాక్షిని పెళ్లి చేసుకున్నాడా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సల్మాన్, సోనాక్షి ఉంగరాలు మార్చుకుంటున్న ఫోటో ఒకటి ఇటీవల బయటకు రావడంతో ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారనే రూమర్స్ మొదలయ్యాయి. దీంతో ఈ ఇద్దరు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఆ ఫోటో పక్కా ఫేక్. రూమర్స్ వ్యాప్తి చేయడం కోసమే కొంతమంది కావాలని దాన్ని క్రియేట్ చేశారు. సల్మాన్, సోనాక్షిని పక్కపక్కన పెట్టి రింగ్స్ మార్చుకుంటున్నట్లుగా ఫోటోను ఎడిట్ చేశారు. కాబట్టి సల్మాన్ ఖాన్-సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకున్నారనే ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదు.


సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ చిత్రంతోనే సోనాక్షి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 11 ఏళ్లుగా బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఈ హీరోయిన్ నటుడు జహీర్ ఇక్బాల్‌తో ప్రేమలో ఉన్నట్లు ఇటీవల రూమర్స్ వినిపించాయి. సోనాక్షి ఆ రూమర్స్‌ను కొట్టిపడేశారు. అతను తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సోనాక్షి 'శివం' సినిమాలో నటిస్తున్నారు. ఇక సల్మాన్ విషయానికొస్తే.. ప్రస్తుతం టైగర్ 3 సినిమాతో సల్లూ భాయ్ బిజీగా ఉన్నాడు.


Also Read: Panch Grahi Yog 2022: పంచ గ్రహ కూటమి ఎఫెక్ట్.. ఆ రాశుల వారికి అదృష్టమే అదృష్టం


Also Read: Lucky Zodiac Signs: ఈ మూడు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఇకపై వారి పట్టిందల్లా బంగారమే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook