Family star Vaccha Vacchhaa Video Song: విజయ్ దేవరకొండ కొన్నేళ్లుగా సాలిడ్ స‌క్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ రూట్లోనే తనకు 'గీత గోవిందం' వంటి హిట్ అందించిన దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో 'ఫ్యామిలీ స్టార్' మూవీతో రాబోతున్నాడు. ఈ నెల 5న విడుదల కానున్న ఈ సినిమా బుకింగ్స్ ఇప్ప‌టికే  అన్ని చోట్ల ఓపెన్ అయ్యాయి. అటు యూఎస్ లో కూడా ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఈ సినిమాలోని వ‌చ్చా వ‌చ్చా ఫుల్ వీడియో సాంగ్‌ను వీడియో పాట‌ను విడుద‌ల చేసారు. పెళ్లి వేడుకలకు సంబంధించిన వచ్చే  ఈ పాట విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా.. సింగారీ చెయ్యందించా.. ఏనుగంబారీ సిద్దంగుంచా అంటూ సాగే ఈ పాట పల్లవి ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంది. ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 గోపీ సుందర్ ఈ సినిమాకు మంచి మ్యూజిక్ అందించారు. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్‌ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా దాదాపు 2 గంటల 40 నిమిషాలు వుంది. ఈ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్ హీరోగా ఫ్యామిలీ హీరోగా స్ధిర ప‌డ‌టం ప‌క్కా అని చెబుతున్నారు.


ఈ చిత్రానికి వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌. ఏప్రిల్  5వ తేదిన ఈ సినిమా ను తెలుగు,తమిళంలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ లాస్ట్ ఇయర్  'ఖుషీ' మూవీతో ఆడియన్స్‌ను పలకరించారు. అంతకు ముందు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' మూవీలో ప్యాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్‌ ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన విజయం సాధించలేదు. అయినా.. ఈ కెరీర్ పై పెద్దగా ఎఫెక్ట్ ఏమి చూపించలేదు. ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతున్నాడు. ది ఫ్యామిలీ మ్యాన్ సినిమాతో విజయ్ దేవరకొండ హీరోగా బ్యాక్ బౌన్స్ అవుతాడా లేదా అనేది వెయిట్ అండ్ సీ.


Read More: Mamata Banerjee: బీజేపీకి 400 కాదు కదా.. ఆ సీట్లు కూడా రావంటూ ఘాటువ్యాఖ్యలు చేసిన మమతా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి