Film Distributors Demands to Telugu Film Chamber: ప్రస్తుతానికి టాలీవుడ్ సినిమా షూటింగ్లు అన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. సినీ నిర్మాతలకు ఉన్న సమస్యలు తీరే విధంగా నిర్ణయాలు తీసుకుని ఆ తర్వాత సినిమా షూటింగ్స్ మళ్లీ మొదలు పెట్టాలని నిర్మాతల భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు రంగాల వారితో నిర్మాతలు సమావేశం అవుతున్నారు. తాజాగా సినిమా డిస్ట్రిబ్యూటర్లతో ఫిలిం ఛాంబర్ సమావేశం అయింది. ఈ సందర్భంగా ఎన్ఆర్ఏ పద్ధతి రద్దు చేయాలని మెజారిటీ డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే కచ్చితంగా డిజిటల్ రిలీజ్ కి 8 వారాలు గ్యాప్ పాటించాలని లేదా ఒకవేళ ముందుగా రిలీజ్ చేయాలి అనుకుంటే 30% డిస్ట్రిబ్యూటర్లకు వెనక్కి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక మల్టీప్లెక్స్ లలో 60 -40% చేయాలనే విషయం మీద కూడా చర్చ జరిగింది. అంతేకాక అవుట్ రేట్ విధానాల్లో జీఎస్టీ ఇంక్లూడ్ చేయాలనే విషయం మీద కూడా ఈ సందర్భంగా చర్చ జరిగింది. ఇక డిస్ట్రిబ్యూటర్ల నుంచి అడ్వాన్సులు తీసుకున్న నిర్మాత తన తర్వాత సినిమా ఆ అడ్వాన్స్ చెల్లించాకే రిలీజ్ చేయాలని కూడా డిస్ట్రిబ్యూటర్లు పట్టు పట్టారు. అంతేకాక పోస్టర్స్ పబ్లిసిటీ విషయంలో కూడా ఖర్చులు ఎవరివి అనే విషయం మీద క్లారిటీ ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లు కోరారు.


ఇక ఈ సమావేశంలో నైజాం ప్రాంతం నుంచి ఏషియన్ సునీల్, శిరీష్, అభిషేక్ నామ, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వీరి నాయుడు, ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి భారత్ చౌదరి, అనుశ్రీ సత్యనారాయణ, వెస్ట్ గోదావరి నుంచి ఎల్విఆర్, కృష్ణాజిల్లా నుంచి సాయిబాబా, సర్వేశ్వరరావు గుంటూరు జిల్లా నుంచి సుధాకర్ విఎంఆర్, నెల్లూరు జిల్లా నుంచి హరి, సీడెడ్ నుంచి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఇక ఫిలిం ఛాంబర్ తరపున ముత్యాల రామదాసు ఈ భేటీలో పాల్గొన్నారు. ఇక ఈ అంశాలకు సంబంధించి తదుపరి సమావేశం మరోసారి ఈనెల 16వ తేదీన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆ సమావేశంలో తుది కార్యాచరణ విధివిధానాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.


Also Read: Bimbisara: బంపర్ హిట్ మిస్ చేసుకున్న స్టార్ హీరో.. ఇదే కాదు ఈ హిట్ సినిమాలన్నీ మిస్!


Also Read: Priya Prakash Varrier: ఏకంగా బాత్రూంలో ఫోటోలు షేర్ చేసిన ప్రియా ప్రకాష్.. అలా పడుకుని మరీ అందాల విందు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook