VarunLav Wedding : మెగా హీరో వరుణ్ తేజ్, టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠిలు ఎంతో కాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ లో నిశ్చితార్థం చేసుకున్న ఈ మెగా జంట తాజాగా నవంబర్ 1న ఇటలీలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని భార్యాభర్తలు గా తమ కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మెగా కుటుంబ సభ్యులతో పాటు అల్లు కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్లి వేడుకలో పాలుపంచుకున్నారు. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మెగా హీరోలందరూ కూడా కలిసి కొత్తజంటతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.


పెళ్లి కోసం కోట్లు ఖర్చు పెట్టి కళ్ళు చెదిరే లాగా పెళ్లి చేసిన మెగా కుటుంబం తాజాగా ఇప్పుడు వీరి పెళ్లి వీడియోని ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ కి ఇవ్వబోతోంది అని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు సెలబ్రిటీలు తమ గ్రాండ్ పెళ్లి వీడియోలను ఓటీటీలకు ఇచ్చి స్ట్రీమ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి వీడియో కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది అని పుకార్లు వినిపించాయి.


నెట్ ఫ్లిక్స్ వారు నాగబాబుకి భారీ ఆఫర్ ఇచ్చారని దీంతో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి వీడియో ఏకంగా 8 కోట్ల రూపాయలకు అమ్ముడైంది అని టాక్ కూడా వినిపించింది. తాజాగా మెగా పీ ఆర్ టీమ్ ఇప్పుడు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదు అంటూ ఈ పుకార్లను కొట్టి పారేసింది. దయచేసి ఇలాంటి పుకార్లను నమ్మవద్దు అని ప్రెస్ నోట్ ని కూడా రిలీజ్ చేసింది.


దీంతో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి వీడియో స్ట్రీమింగ్ గురించి అభిమానులకి క్లారిటీ వచ్చేసింది. ఈ విషయంలో కొంత నిరాశ చెందుతున్నప్పటికీ వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు మాత్రమే చూస్తూ అభిమానులు సంతోషిస్తున్నారు. మెగా, అల్లు కుటుంబాలతో పాటు నితిన్ కూడా తన భార్య శాలిని తో వీరి పెళ్ళికి హాజరైన సంగతి తెలిసిందే.


Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…


Also Read: Redmi 13C Price: అదిరిపోయే ఫీచర్స్‌తో డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Redmi 13C మొబైల్‌..స్పెసిఫికేషన్స్‌ ఇవే..  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook