Niharika deletes her husband’s photos: మెగా డాటర్ నిహారిక గత కొన్నాళ్లుగా వార్తలలో నిలుస్తూనే వస్తోంది. దానికి కారణం ఆమె తన భర్త జొన్నలగడ్డ చైతన్య నుంచి విడిపోతుందని ప్రచారమే. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదల హీరోయిన్గా కొన్ని సినిమాల్లో ప్రయత్నం చేసింది. కానీ మెగా టాగ్ ఉండడంతో బోల్డ్ షో చేయలేక అలా అని పద్ధతి అయిన పాత్రలు చేస్తుంటే అవకాశాలు రాకపోవడంతో నిర్మాతగా సెటిల్ అవ్వాలని భావించి ఒక నిర్మాణ సంస్థ కూడా ప్రారంభించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాత పెద్దలు ఒక సంబంధం కుదిరిచి ఆమెకు జొన్నలగడ్డ చైతన్య అనే యువకుడితో వివాహం జరిపించారు. వివాహం జరిగిన కొన్నాళ్ల వరకు వీరి జంట బాగానే ఉంది ఆ తర్వాత సడన్ గా నిహారికకు, చైతన్యకు మధ్య దూరం పెరిగింది అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ ప్రచారం ఆగిపోయింది. ఇక ఇప్పుడు ఒక తాజా పరిణామం చోటు చేసుకుంది, అదేమిటంటే గతంలో జొన్నలగడ్డ చైతన్య నిహారికతో కలిసి ఉన్న ఫోటోలు తమ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశాడు.


ఇది కూడా చదవండి: Vetrimaran on Jr NTR: ఎన్టీఆర్ సినిమాపై వెట్రిమారన్ క్లారిటీ.. ఆ ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి?


అలాగే నిహారికని అన్ ఫాలో కొట్టాడు. అయితే నిహారిక మాత్రం ఇన్ని రోజుల నుంచి చైతన్యతో కలిసి ఉన్న ఫోటోలు, పెళ్లి ఫోటోలు డిలీట్ చేయలేదు. దీంతో ఈ విషయం మీద కొంత క్లారిటీ మిస్ అయింది. తాజాగా నిహారిక కూడా చైతన్యతో కలిసి ఉన్న ప్రతి ఫోటో డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆమె ఇంస్టాగ్రామ్ ఏ ఒక్క ఫోటో చైతన్యతో కలిసి ఉన్నది లేదని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం వరకు జొన్నలగడ్డ చైతన్యను సోషల్ మీడియాలో ఫాలో అవుతూనే వచ్చిన నిహారిక ఇప్పుడు ఆయనను అన్ ఫాలో చేయడమే కాదు.


 ఆయనతో కలిసి ఉన్న ఫోటోలు పెళ్లి ఫోటోలు సైతం డిలీట్ చేసింది. ఇక తాజాగా అంశం ఏమిటంటే ఆమె తన ప్రొడక్షన్ కంపెనీ కోసం కొత్త ఆఫీస్ స్టార్ట్ చేసింది. ఈ ప్రొడక్షన్ కంపెనీకి సంబంధించిన ఫోటోలు కొన్ని షేర్ చేయగా ఆ ఫోటోలు అన్నింటిలో ఆమె ఒక్కతే కనిపిస్తుంది. నిజానికి మెగా డాటర్ నాగబాబు కుమార్తె అయిన నిహారిక, చైతన్య వివాహం 2020లో కరోనా కాస్త కుదుట పడిన తర్వాత రాజస్థాన్లో రాయల్ స్టైల్ లో జరిగింది.


ప్రస్తుతానికి ఈ జంట విడాకులు తీసుకోలేదు, కానీ దూరం జరిగారని తాజాగా నిహారిక అన్ ఫాలో చేయడం దానికి బలం చేకూరుస్తుందని అంటున్నారు. అయితే ఈ విషయం మీద నాగబాబు సహా మెగా కుటుంబ సభ్యులు ఎవరూ, ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు లేవు చూడాలి. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది.


ఇది కూడా చదవండి: Balagam Director Venu: మా మనోభావాలు దెబ్బతీశాడు, చర్యలు తీసుకోండి.. బలగం డైరెక్టర్‌ వేణుపై ఫిర్యాదు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook