Rape Case FIR Filed on Singer Rahul Jain: బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సింగర్, కంపోజర్ రాహుల్ జైన్ పై తీవ్ర ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. సోమవారం పోలీసులు సింగర్‌ రాహుల్ జైన్  మీద ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేశారు. కాస్ట్యూమ్ స్టైలిస్ట్  అయిన ఒక మహిళపై రాహుల్ జైన్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ముంబైలోని తన ఫ్లాట్‌కు పిలిచి మరీ రాహుల్ జైన్ తనపై అత్యాచారం చేశాడని సదరు మహిళ ఆరోపించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో సదరు మహిళ రాహుల్ జైన్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయింది. ముంబై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన క్రమంలో ఈ సంఘటన 2020లో జరిగిందని ఆమె పేర్కొన్నారు. సదరు కాస్ట్యూమ్ డిజైనర్ రాహుల్ జైన్ ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిందని ఆమె పేర్కొంది. ఓషివారా పోలీస్ స్టేషన్‌లో ఆమె చేసిన ఫిర్యాదు చేసిన ప్రకారం రాహుల్ జైన్ తనను ఇన్‌స్టాగ్రామ్‌లో సంప్రదించారని, నీ వర్క్ బాగుందని మెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఆ తరువాత సబర్బన్ అంధేరి ప్రదేశంలో ఉన్న తన ఫ్లాట్‌ను సందర్శించాల్సిందిగా కోరాడని, అంతేకాక ఆమెను తన వ్యక్తిగత కాస్ట్యూమ్ స్టైలిస్ట్‌గా కూడా నియమిస్తానని హామీ ఇచ్చాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఏదో సాకుతో తన బెడ్‌రూమ్‌ను చూపించి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే రాహుల్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. గతేడాది కూడా రాహుల్‌పై ఇలాగే లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. గతంలో ఆరోపణలు చేసిన బాలీవుడ్ లిరిక్ రైటర్ తన మీద అత్యాచారం చేయడంతో పాటు బలవంతంగా అబార్షన్ చేయించడం, చీటింగ్ చేసినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెక్షన్ 376, 323 మరియు 506 కింద సింగర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. అయితే రాహుల్ జైన్‌ను ఈ కేసులో అరెస్టు చేయలేదు. అయితే గాయకుడు రాహుల్ జైన్ ఈ ఆరోపణలను ఖండించారు. అవన్నీ తప్పుడు ఆరోపణలు, నిరాధారమైనవి అని పేర్కొన్నారు. రాహుల్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించిన క్రమంలో అసలు ఆ మహిళ ఎవరో నాకు తెలియదని, ఆమె చేసిన ఆరోపణలు అవాస్తవాలు, నిరాధారమైనవి అని అన్నారు.


గతంలో కూడా ఓ మహిళ నాపై ఇలాంటి ఆరోపణలు చేసినా ఆ విషయంలో నాకు న్యాయం జరిగిందని రాహుల్ అన్నారు. ఈ మహిళ ఆమె మిత్రురాలు కావచ్చేమో అని కూడా అనుమానం వ్యక్తం చేశారు. రాహుల్ 2014లో ఎంటీవీ అలోఫ్ట్ స్టార్ షోలో కనిపించడంతో మంచ పాపులారిటీ వచ్చింది. ఆ తరువాత స్పాట్‌లైట్ అనే వెబ్ సిరీస్ కోసం 'తేరీ యాద్' (ఫీవర్), 'ఆనే వాలే కల్', 'ఘర్ సే నిక్లా', 'నా తుమ్ రహే నా హమ్' సహా 'చల్ దియా' వంటి పాటలు పాడారు. రాహుల్ మ్యూజిక్ కంపోజర్‌గా కూడా చాలా సినిమాలకు పనిచేశారు. 


Also Read: Karthikeya 2 Collection: సత్తా చాటిన కార్తికేయ 2.. మూడో రోజు సంచలనం.. బ్రేక్ ఈవెన్ ఫినిష్ చేసి కోట్లలో లాభాలు!


Also Read: Tollywood Movies Collections: టాలీవుడ్ కు కలిసొచ్చిన ఇండిపెండెన్స్ డే.. భారీగా వసూళ్లు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి