Rajinikanth: రజినీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘కూలి’ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగార్జున విలన్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ హార్బర్ ప్రాంతంలో జరుగుతోంది. అక్కడ షూటింగ్ జరుగుతున్న సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బీచ్ రోడ్ లో ఉన్న కంటెయినర్ టెర్మినల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమీపంలోని అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ సందర్భంగా అక్కడ ఎలాంటి అవాంచీనయ సంఘటనలు జరగలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చైనా నుంచి లిథియం బ్యాటరీల లోడ్ తో ఈ కంటెయినర్ ఆగష్టు 28న పోర్ట్ కు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా కంటెయినర్ టెర్మినర్ లో ప్రమాదం సంభవించింది. అయితే కూలీ షూటింగ్ స్పాట్ లో ఉన్న చిత్ర యూనిట్ పెద్ద ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. అగ్ని ప్రమాదం వెనక కారణాలను వెలికి తీసే పనిలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.


ప్రస్తుతం రజనికాంత్ జ్ఞావవేల్ రాజా దర్శకత్వంలో ‘వేట్టాయిన్’ మూవీతో పలకరించబోతున్నాడు. తెలుగులో ఈ సినిమాను ‘వేటగాడు’ పేరుతో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రానా సహా పలువరు నటీనటులు యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే నెల 10న దసరా కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా కూలి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రజినీ ఊర మాస్ గెటప్ లో ప్రేక్షకులను అలరించనున్నాడు. పైగా కూలి టైటిల్ అంటే సినిమా ఎలా ఉండబోతుందో చెప్పాల్సిన అవసరం లేదు. పైగా నాగార్జన వంటి స్టార్ హీరో ఈ సినిమా యాక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకున్నాయి. 


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!


ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.