Akkineni Akhil: ఏజెంట్ డిజాస్టర్ తరువాత అఖిల్ పై ఆఫర్ల వర్షం.. మరో రెండు పాన్ ఇండియా సినిమాలు?
Back to Back Film Offers to Akkineni Akhil: ఏజెంట్ లాంటి డిజాస్టర్ తర్వాత కూడా పలు బడా ప్రాజెక్టులు తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్న నిర్మాతలు అఖిల్ ని పెట్టాలని అనుకుంటున్నట్టు అంటున్నారు.
Flood of Pan-India Film Offers to Akkineni Akhil: హీరోగా నిలదొక్కుకోవడానికి అక్కినేని అఖిల్ చేయని ప్రయత్నం అంటూ లేదు. వివి వినాయక్ దర్శకత్వంలో హీరోగా అక్కినేని అఖిల్, అఖిల్ అనే సినిమాతో లాంచ్ అయ్యాడు. ఆ తరువాత ఆ సినిమా డిజాస్టర్ కావడంతో చాలా కాలం సినిమాలకు దూరమైనా వెంట వెంటనే హలో, మిస్టర్ మజ్ను లాంటి సినిమాలు కూడా చేశాడు. ఆ సినిమాలు కూడా దారుణమైన డిజాస్టర్ ఫలితాలు అందుకున్నాయి.
ఆ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కొంతవరకు అఖిల్ ని డిజాస్టర్ హీరో అనే పేరు లేకుండా చేసింది. ఇక ఈమధ్య అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసిన ఏజెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిజానికి ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించారు, సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ తెలుగులో వచ్చిన రిజల్ట్ ని ఆధారంగా చేసుకుని ఇతర భాషల్లో రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.
అయితే సినిమా తెలుగులో రిలీజ్ చేసిన తర్వాత డిజాస్టర్ ఫలితాన్ని అందుకోవడంతో ఇక అఖిల్ కెరియర్ ముగిసినట్టే అని చాలామంది భావించారు. అయితే అక్కినేని అఖిల్ ఎన్ని డిజాస్టర్ సినిమాలు ఇస్తున్న ఆయనకి ఇంకా ఇంకా పాన్ ఇండియా అవకాశాలు వస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే అక్కినేని అఖిల్ యువి క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ఒక కొత్త దర్శకుడు తెరకెక్కించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
దానికి తోడు అఖిల్ కు మరిన్ని అవకాశాలు వస్తున్నాయని ప్రచారం కూడా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. ఏజెంట్ లాంటి డిజాస్టర్ తర్వాత కూడా పలు బడా ప్రాజెక్టులు తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్న నిర్మాతలు అఖిల్ మీద నమ్మకం పెట్టుకుంటున్నారని అంటున్నారు. ఒకవేళ అఖిల్ కి సరైన కంటెంట్ పడితే మంచి వసూళ్లు సాధిస్తాడని వారంతా నమ్ముతున్నారట. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ సినిమాని ఫైనల్ చేసిన అఖిల్ మరో ఇద్దరు దర్శకులతో కూడా డిస్కషన్స్ చేస్తున్నాడని ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది.
వంశీ పైడిపల్లి, దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తమ దగ్గర ఉన్న రెండు కథలను అఖిల్ దృష్టికి తీసుకు వెళ్లినట్లుగా చెబుతున్నారు. వంశీ పైడిపల్లి సంగతి పక్కన పెడితే శ్రీకాంత్ ఓదెల దసరా సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. సుకుమార్ శిష్యుడు కావడం చేసిన మొదటి సినిమాతోనే అద్భుతమైన స్పందన తెచ్చుకోవడంతో ఆయన కథ చెబితే చాలామంది స్టార్ హీరోలు సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం జరిగింది.
కానీ ఎందుకో ఆయన అఖిల్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అఖిల్ మొదటి సినిమా వివి వినాయక్ తో పూర్తి చేసి రిలీజ్ చేయగా డిజాస్టర్ గా నిలిచిన తర్వాత రెండో సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. కానీ అది అప్పట్లో పట్టాలెక్కలేదు. అప్పట్లో రణబీర్ కపూర్ ఏ జవానీ హై దివానీ సినిమాని తెలుగులోకి అడాప్ట్ చేయడానికి వంశీ పైడిపల్లి ప్రయత్నించారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో సరైన హీరోని వెతికి పట్టుకునేందుకు ఇబ్బందులు పడుతున్న వంశీ పైడిపల్లి అఖిల్ మీద బెట్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాల్సి ఉంది.
Also Read: Adipurush Buy one get one: ఆదిపురుష్ చూడాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరోటి ఫ్రీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook