Adipurush Buy one get one: ఆదిపురుష్ చూడాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరోటి ఫ్రీ!

One Plus one Ticket Offer Adipurush Movie: తాజాగా ఆదిపురుష్ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన ఆఫర్ ప్రకటించింది పేటీఎం సంస్థ. ఒక టికెట్ రేటుతో రెండు టికెట్లు బుక్ చేసుకోవచ్చు అంటూ ఒక ఆఫర్ ప్రకటించారు ఆది పురుష్ డైరెక్టర్ ఓం రౌత్.   

Written by - Chaganti Bhargav | Last Updated : May 10, 2023, 08:52 PM IST
Adipurush Buy one get one: ఆదిపురుష్ చూడాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరోటి ఫ్రీ!

One Plus one Ticket Offer Adipurush: ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆది పురుష్ మొదటి వరుసలో నిలుస్తోంది. ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కృతి సనన్, సీత పాత్రలో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో తెరకెక్కిన ఈ మైథాలజికల్ మూవీ జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాని మొత్తం ప్రపంచవ్యాప్తంగా 14 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ సినిమాని యూవీ క్రియేషన్ సంస్థ తెలుగులో రిలీజ్ చేస్తుంది. ఈ సినిమాలో ఆంజనేయుడుగా దేవ దత్త నాగే కనిపించగా తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ఒక్కసారిగా సినిమా మీద అంచనాలను పెంచేసింది. వాస్తవానికి ఆది పురుష్ టీజర్ రిలీజ్ అయిన సమయంలో సరైన విఎఫ్ఎక్స్ షాట్స్ లేవని పిల్లలు చూసే కార్టూన్లు కూడా దీనికంటే అద్భుతంగా ఉంటాయంటూ కామెంట్లు వినిపించిన నేపథ్యంలో కాస్త గ్యాప్ తీసుకున్న సినిమా యూనిట్ పూర్తిస్థాయిలో విఎఫ్ఎక్స్ మీద దృష్టి పెట్టి దాన్ని అందరూ మెచ్చే విధంగా తీర్చిదిద్దింది.

Also Read: VD12 Copy Poster: విజయ్ దేవరకొండ 12 పోస్టర్ కాపీ పేస్ట్.. అసలు విషయం చెప్పేసిన నాగవంశీ!

ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ మీద అందరి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆసక్తికరంగా హిందీ వర్షన్ ఆది పురుష్ ట్రైలర్ అయితే 24 గంటల్లోనే 52 మిలియన్ వ్యూస్ సాధించి హిందీ మూవీ ట్రైలర్స్ రికార్డులను బద్దలు కొట్టింది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను భూషణ్ కుమార్. క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఉత్సవానికి ఈ సినిమాని గత ఏడాది ఆగస్టు 11వ తేదీన విడుదల చేయాల్సి ఉన్నా విఎఫ్ఎక్స్ చేయించాల్సి ఉండడంతో ఈ ఏడాది జనవరికి వాయిదా వేశారు. అయితే అప్పటికి కూడా విఎఫ్ఎక్స్ పూర్తికాని నేపథ్యంలో జూన్ నెలలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన ఆఫర్ ప్రకటించింది పేటీఎం సంస్థ. అదేమిటంటే ఒక టికెట్ రేటుతో రెండు టికెట్లు బుక్ చేసుకోవచ్చు అంటూ ఒక ఆఫర్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆది పురుష డైరెక్టర్ ఓం రౌత్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

Also Read: Ravi Krishna Dating: ఆ సీరియల్ హీరోయిన్ తో విరూపాక్ష నటుడి డేటింగ్.. క్లారిటీ ఇచ్చేశాడు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News