Harish Rao on Pallavi Prashanth: బిగ్‌బాస్ 7 తెలుగు విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ పై అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. రైతు బిడ్డగా హౌస్ లో అడుగుపెట్టి తన ఆటతీరుతో విన్నర్ అయిన ప్రశాంత్ పై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీష్ రావు ప్ర‌శంస‌లు కురిపించాడు. సిద్దిపేట రైతుబిడ్డ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ బిగ్ బాస్ ట్రోఫీ గెలవడం గర్వంగా ఉందని.. ఇది సామాన్యూడి సాధించిన విజయమని ఎమ్మెల్యే అన్నారు. రైతుబిడ్డ‌గా పొలాల నుంచి బిగ్‌బాస్ షో వ‌ర‌కు సాగిన ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ ప్ర‌యాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయ‌క‌మ‌ని హ‌రీష్ రావు తన ట్వీట్ లో తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 07లో అడుగుపెట్టాడు ప్రశాంత్. మెుదటి రెండు వారాలు హౌస్ మేట్స్ కారణంగా కొంత ఇబ్బందిపడిన తర్వాత తన గేమ్ తో పోటీలో నిలిచాడు రైతు బిడ్డ. రతికా వెళ్లిపోయిన తర్వాత ప్రశాంత్ గేమ్ ఫీక్స్ లోకి వెళ్లింది. శివాజీ, ప్రిన్స్ సపోర్టుతో ప్రశాంత్ చెలరేగి ఆడాడు. టాస్కులో 100 శాతం ఎఫెర్ట్ పెట్టేవాడు. బిగ్ బాస్ ఎక్కువ గేమ్స్  ప్రశాంత్, అర్జున్ గెలిచారు. సహాయం చేయడంలోనూ రైతు బిడ్డ ముందుండేవాడు. శివాజీ చేయి బాగోకపోతే దగ్గర ఉండి మరి సేవలు చేశాడు. ఎవరైనా ఏడిస్తే దగ్గరకు వెళ్లి ఓదార్చేవాడు. ఇంట్లో అందరి కంటే ఎక్కువ పనులు ప్రశాంతే చేసేవాడు. అతడి ఆట, మాట నచ్చి ప్రేక్షకులు ప్రశాంత్ ను విన్నర్ గా చేశారు. 



బిగ్ బాస్ లో అడుగుపెట్టినప్పటి తర్వాత ప్రశాంత్ సోషల్ మీడియాలో స్టార్ అయిపోయాడు. ఇతడు నామినేషన్స్ లో ఉంటే సగం ఓటింగ్ ఇతడికే పోలైంది. అంతలా అందరి అభిమానాన్ని గెలుచుకున్నాడు ప్రశాంత్. హౌస్ లో చాలా మంది ప్రశాంత్ ను తక్కువ చేసి మాట్లాడటం, చిన్న చూపు చూసినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా తన లక్ష్యం కోసం నూటికి నూరుశాతం కష్టపడి చివరికి విజేతగా నిలిచాడు. బిగ్‌బాస్ విన్న‌ర్‌గా నిలిచిన ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌కు 35 ల‌క్ష‌ల ప్రైజ్‌మ‌నీతో పాటు ఓ కారు, డైమండ్ న‌క్లెస్ లభించాయి. 


Also Read: Salaar Second Trailer : సలార్ రెండో ట్రైలర్ రిలీజ్.. బాక్సాఫీస్ బద్దలు.. ఫ్యాన్స్‌కు పునకాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి