Balakrishna- Boyapati : బాలయ్య-బోయపాటి మూవీ కోసం కొట్టుకుంటున్న ఆ నలుగురు టాప్ ప్రొడ్యూసర్స్
Producers Trying to do Balakrishna- Boyapati Movie: బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ సినిమా చేసేందుకు తెలుగులో టాప్ నిర్మాతలు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది, దానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Four Top Producers Trying to do Balakrishna- Boyapati Movie: బాలకృష్ణ హీరోగా బోయపాటి డైరెక్షన్లో సినిమా అనగానే ఆ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడతాయి, ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి మూడు సినిమాలు చేశారు. దాదాపు మూడు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. మొదటిసారి వీరిద్దరూ కలిసి సింహ అనే సినిమా చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తర్వాత లెజెండ్ అనే సినిమా చేస్తే ఆ సినిమా కూడా బంపర్ హిట్ గా నిలిచి ఇద్దరికీ మంచి పేరు తీసుకువచ్చింది.
ఇక ఆ తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన అఖండ సినిమా చేయగా అది కూడా సంచలనం సృష్టించి హాట్ టాపిక్ గా మారింది. ఇక వీరిద్దరూ కలిసి మరోసారి సినిమా చేస్తామని ముందే ప్రకటించారు. అది అఖండ సీక్వెల్ అయినా అయి ఉండవచ్చు అంటూ కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఇద్దరి కాంబినేషన్లో సినిమా సెట్ చేసేందుకు దాదాపు నలుగురు నిర్మాతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద చిన్నబాబు అలాగే నాగవంశీ నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ సినిమా చూసి ఎందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే అఖండ సినిమా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద వీరిద్దరితో కలిసి సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అదే విధంగా సుధాకర్ చెరుకూరి ప్రస్తుతానికి దసరా సినిమా నిర్మిస్తున్నారు.
నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమా మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఆయన కూడా బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అనిల్ సుంకర రామబ్రహ్మం సుంకర కూడా వీరితో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన ఓ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది ఇక డిసెంబర్ నెలలో అనిల్ రావిపూడి తో సినిమా కూడా ప్రారంభోత్సవం జరుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Maredumilli Vs Thodelu: పూర్తి భిన్నమైన లైన్స్ లో సాగిన మారేడుమిల్లి- తోడేలు.. లైన్స్ ఏమేంటో తెలుసా?
Also Read: December 2022: డిసెంబర్ నెలలో 20 సినిమాలే, ఆ ఒక్కరోజే ఏడు సినిమాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook