Bigg Boss Telugu: బిగ్ బాస్ ఈవారం అంతా ఫన్ టాస్కులు జరగనున్నాయి అని తెలియజేశారు. అయితే ప్రస్తుతం ఇంట్లో జరుగుతుండేది మాత్రం అలా లేదు. బిగ్ బాస్ చెప్పింది ఫన్ టాస్క్ అయినా కంటెస్టెంట్లు మాత్రం  వీటిని సీరియస్‌గానే తీసుకుంటున్నారు. ఫైనల్స్ దగ్గర పడుతు ఉండడంతో చాలా సీరియస్ గా గేమ్స్ లో మునిగిపోతున్నారు హౌస్ మేట్స్. కాగా ఈవారం బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి నేరుగా ఓటింగ్ అప్పీల్ చేసుకునే అవకాశాన్ని అందించారు. అయితే ఆయన ఇచ్చిన ఈ ఆఫర్ అందుకోవాలంటే మాత్రం ఫన్నీ టాస్కులు దాటాలి. బిగ్ బాస్ ఇస్తున్న ఈ టాస్కులు ఫన్నీగా ఉన్నా.. దీనివల్ల గొడవలు మాత్రం సీరియస్‌గానే జరిగాయి. అంతేకాదు టాస్క్ ఓడిపోవడంతో శోభా కన్నీళ్లు కూడా పెట్టేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఫన్ టాస్కులు మొదలయ్యేటప్పుడు బిగ్ బాస్  అమర్‌దీప్‌ను యాక్టివిటీ ఏరియాలోకి పిలిచిన ఒక కిలో కేక్‌ను ఒక్కడినే తినమని చెప్పాడు. అలా తినగలిగితే మిగతా హౌజ్‌మేట్స్‌కు కూడా కేక్ లభిస్తుందని తెలిపారు. దాంతో అమర్‌దీప్‌ కేక్ తినడం ప్రారంభించారు అయితే కాసేపయ్యాక మాత్రం వల్ల కావడం లేదని కేక్‌ను వదిలేశాడు. బయటికి వెళ్లి యాక్టివిటీ ఏరియాలో కాన్ఫరెన్స్ రూమ్ లో జరిగినది ఏది హౌస్ మేట్స్ కి చెప్పకూడదు అనడంతో… బయటికి వచ్చిన అమర్.. ఓవరాక్షన్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కాసేపటికే అసలు అమర్ యాక్టివిటీ ఏరియాలో ఏం చేశాడు అనే విషయాన్ని వీడియో ద్వారా హౌజ్‌మేట్స్ అందరికీ చూపించారు బిగ్ బాస్. ఇక ఈ వీడియో చూసి హౌస్ మేట్స్ అంతా నవ్వుకోవడమే కాకుండా అమర్ ఎలా అంత కేక్ తిన్నారు కాబట్టి రోజంతా ఫుడ్ పెట్టకూడదని నిర్ణయించుకునేశారు.


ఇక ఫన్ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ దం మ్యూజిక్ ప్లే అయినప్పుడు కంటెస్టెంట్స్ అంతా పరిగెత్తుకుంటూ వెళ్లి పూల్‌లో దూకాలి‌ .. అయితే ఎవరైతే లాస్ట్ లో దూకుతారు వారు ఓడిపోతారు అని తెలియజేశారు. మొదటి రౌండ్ లోనే అమర్ డీప్ అవుట్ అవ్వడంతో ఆయన ఈ గేమ్ కి సంచాలకుడిగా మారారు. ఇక రెండో రౌండ్‌లో శోభ ఔట్ అవ్వడంతో ఆమె ఇది ఫన్ టాస్క్ అయినప్పటికీ కన్నీళ్లు పెట్టుకుంది. తనకు ఇక మళ్లీ అవకాశం రాదని, ఇదే లాస్ట్ అని ఏడవడం మొదలుపెట్టింది. అమర్ ఓదార్చే ప్రయత్నం చేసినా కూడా శోభా మాత్రం చాలా సేపు వరకు ఏడుస్తూ ఆ తర్వాత డల్ గానే ఉన్నింది. శోభా తర్వాత అర్జున్, ప్రశాంత్‌లు ఔట్ అయ్యారు.


కాగా ప్రశాంత్ మాత్రం తన ఓటమిని అంగీకరించలేదు. ప్రియాంక కన్నా ముందు తానే దుకానని వాదించడం మొదలుపెట్టాడు. వీడియో కావాలి అంటూ అరిచాడు. కాగా ఫన్ టాస్క్‌లో ఏంటి మీ గోల అని అర్జున్ చెప్తున్నా వినలేదు. ఇక ఆ తరువాత ఫైనల్‌గా పూల్ టాస్కులో యావర్, శివాజీ మిగలగా.. యావర్ ఫైనల్ గా విన్నర్‌గా నిలిచారు. దీంతో మొదటి ఫన్ టాస్కు‌లో యావర్ విన్నర్ అయ్యి ఓటు అప్పీల్ చేసుకోవడానికి ఒక అడుగు ముందుకు వెళ్లాడని బిగ్ బాస్ ప్రకటించారు. కానీ యావర్ గెలవడం కోసం తనను  నెట్టేసి ముందుకు వెళ్లాడని అర్జున్ ఆరోపించాడు. యావర్ తొయ్యడం వల్ల తన మొహానికి యావర్ చెయ్యి గట్టిగా తగిలిందని.. ఇది ఫన్ టాస్క్‌లాగా లేదని, రేపు కూడా అలాగే చేస్తే తిరిగి కొడతానని అమర్ దీప్తి తన కోపం చెప్పుకోచ్చారు అర్జున్.


Also Read: Telangana Election 2023 Result Live: బీజేపీ విజయం సాధించిన స్థానాలు ఇవే.. కీలక నేతలు ఓటమిపాలు 


Also read: Telangana Election Results 2023: తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook