Gaami Movie 3 Days Box Office Collections :  టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్‌సేన్  ముఖ్యపాత్రలో .. చాందిని చౌదరి మరో లీడ్‌ రోల్లో యాక్ట్  చేసిన సినిమా 'గామి'.  విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన  మూవీలో విశ్వక్‌సేన్ అఘోర పాత్రలో నటించాడు. మనుషుల స్పర్శను తట్టుకోలేని శంకర్ అనే అఘోర పాత్రలో విశ్వక్ సేన్ నటన ఆకట్టుకుంటుంది.  రెగ్యులర్‌గా వచ్చే సినిమాలకు భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు కాసుల వర్షం కురిపిస్తున్నారు. మొత్తంగా విడుదలైన రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ప్లస్‌గా మారింది. మొత్తంగా ఈ సినిమాలో ఆధ్యాత్మికతతో పాటు సైన్స్, మూఢ నమ్మకాల సమ్మిళతంగా ఈ సినిమాను విద్యాధర్ కాగిత తెరకెక్కించాడు. మరోవైపు ఈ సినిమాకు నిర్మాణ విలువలు, గ్రాఫిక్స్ వర్క్స్ ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. మరోవైపు ఈ సినిమాకు పోటీగా విడుదలైన చిత్రాలు పెద్దగా ఏమి లేకపోవడం ఈ సినిమాకు అనుకూలంగా మారిందనే చెప్పాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాకు మూడు రోజుల్లో కలిపి దాదాపు 20.3 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు చిత్ర యూనిట్ అఫిషియల్‌గా ప్రకటించింది. షేర్ విషయానికొస్తే.. దాదాపు రూ. 9.5 కోట్ల వరకు రాబట్టింది. ఈ సినిమా రూ. 10.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ సినిమా మరో రూ. 1 కోటి రూపాయల షేర్‌ రాబడితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి.


ఈ సినిమా ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..


తెలంగాణ (నైజాం).. రూ. 3.50 కోట్లు..
రాయలసీమ (సీడెడ్).. రూ. 1.2 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్ .. రూ. 3.50 కోట్లు..
తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 8.20 కోట్లు
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 2 కోట్లు..
టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 10.20 కోట్లు..


విశ్వక్ సేన్ గత సినిమా 'దమ్కీ' మూవీ మంచి బిజినెస్ చేసింది. తాజాగా గామి సినిమా కూడా అదే రేంజ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా మంచి వసూళ్లనే రాబడుతోంది. మొత్తంగా టెన్త్, ఇంటర్ విద్యార్ధుల పరీక్షలు ఉన్న ఈ సినిమాకు ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు. అదే హాలీడేస్‌లో ఈ సినిమా విడుదలై ఉంటే ఈ సినిమా కలెక్షన్స్ రేంజ్ మరో లెవల్లో ఉండదనే టాక్ వినబడుతోంది.


Also read: Siddham Meeting: మీరు కృష్ణుడు.. నేను అర్జునుడిని.. కురుక్షేత్రానికి సిద్ధమా?: వైఎస్‌ జగన్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook