Garikapati controvecy comments on kalki 2898 ad: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కర్ణుడిగా నటించిన.. కల్కీ 2898 AD హావా ఇంకా కొనసాగుతుంది. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, దీపికా పదుకొనే, అర్జునిడిగా..విజయదేవర కొండ నటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లో కూడా రికార్డులను తిరగారాస్తుంది. ఇప్పటికి కూడా అనేక థియేటర్ లలో హౌస్ ఫుల్ బోర్డులు సైతం కన్పిస్తున్నాయి. కల్కీ మూవీ తర్వాత చాలా మంది మహాభారతంలోని పాత్రలను తెలుసుకొనేందుకు ఆసక్తి చూపించారంట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అసలు.. భారతం అంటే ఇష్టంలేని వారు సైతం..ఈ మూవీ చూశాక.. అసలు ఎవరు ఏంటీ.. అని తెలుసుకునేందుకు ప్రయత్నించారంట. అంటే ఈ సినిమా జనాల మీద ఏ రెంజ్ లో ఎఫెక్ట్ చూపించిందో అర్థం చేసుకొవచ్చు. అయితే.. ఈ కల్కీ సినిమాపై తాజాగా ప్రవచర కర్త గరికపాటి చేసిన వ్యాఖ్యలు మాత్రం దుమారంగా మారాయి.  ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు..


ప్రముఖ  ప్రవచన కర్త గరికపాటి ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రవచానం స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల విడుదలైన కల్కీ సినిమా గురించి మాట్లాడారు. దీనిలో అమితాబ్ అశ్వత్థామగా నటించారు. అయితే.. కర్ణుడిగా ప్రభాస్ నటించిన విషయం తెలిసిందే. అశ్వత్థామను బందీగా చేసినప్పుడు.. ఆయన ఎటు కదల్లేక ఇబ్బంది పడిపోతుంటారు.అప్పుడు.. ప్రభాస్ కు విల్లు తాకడంతో.. ఒక్కసారిగా ఆయనకు గతంలో మాదిరిగా కర్ణుడిగా మారిపోయి, విలన్ తో ఫైట్ చేస్తారు. అశ్వత్థామతో.. ఆలస్యమైందా... ఆచార్య పుత్రా.. అని డైలాగ్ కూడా కొడుతారు.


అది సినిమాకు ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ చేసిందని చెప్పుకొవచ్చు. తాజాగా, ఇదే సీన్ ను ఉద్దేశించి గరికపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాలంతా సినిమాలు చూసి.. కల్కీలో చూపించిన విధంగా అశ్వత్థామ, కర్ణుడులే హీరోగా అయిపోయరని సెటైర్లు వేశారు. అశ్వత్థామ వీరుడని ఆయనే.. ఎన్నోసార్లు కర్ణుడ్ని కాపాడరంటూ చెప్పుకొచ్చారు.ఈ కల్కీ మూవీ వల్ల.. కృష్ణుడు, అర్జునుడు, భీముడు వంటి గొప్ప వాళ్లు కూడా... వీరి ముందు తక్కువ అన్నట్లు చూపించారన్నారు.


సినిమా వాళ్లు.. ఎలా అంటే అలా.. డైలాగ్ లు రాస్తుంటారని కూడా సెటైర్ లు వేశారు. అసలైన భారతం చదివితే.. ఎవరేంటని తెలుస్తుందని కూడా మండిపడ్డారు. దీంతో ఇది కాస్త వివాదానికి కేరాఫ్ గా మారింది. గతంలో గరికపాటి.. మెగాస్టార్ చిరంజీవిపై కూడా అసహానం వ్యక్తం చేశారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రతి ఏడాది దసరాతర్వాత అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తారు.


Read more: Viral video: ఇదేం పైత్యం.. బావి మీద కూర్చుని ఆ తల్లి ఏంచేస్తుందో తెలిస్తే.. చీపురు తిరగేస్తారు.. వీడియో వైరల్..


దీనిలో మెగాస్టార్ చిరంజీవి, గరికాపటి కూడా హజరయ్యారు అప్పుడు.. స్టేజీ మీద కొంత మంది చిరంజీవితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. అప్పుడు.. గరికపాటి ఫోటోలు ఆపేయాలని, లేకుంటే తాను వెళ్లిపోతానని కూడా వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఇది పెద్ద  రచ్చగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి గరికపాటి ప్రభాస్ కల్కీ మూవీపై వ్యాఖ్యలు చేసి.. మరోసారి కాంట్రవర్షీ రాజేశారని నెట్టింట చర్చ జరుగుతుంది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.