Viral video: ఇదేం పైత్యం.. బావి మీద కూర్చుని ఆ తల్లి ఏంచేస్తుందో తెలిస్తే.. చీపురు తిరగేస్తారు.. వీడియో వైరల్..

Dangerous reels: తల్లి తన పిల్లాడ్ని అడవిలోని ఒక బావి దగ్గరకు తీసుకెళ్లింది. అక్కడ బావి అంచున కూర్చుంది. పిల్లవాడ్ని బావిలో వేలాడదీసింది. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Sep 22, 2024, 07:57 PM IST
  • బావి మీద కూర్చుని మహిళ పాడుపని..
  • సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్న నెటిజన్ లు..
Viral video:  ఇదేం పైత్యం.. బావి మీద కూర్చుని ఆ తల్లి ఏంచేస్తుందో తెలిస్తే.. చీపురు తిరగేస్తారు.. వీడియో వైరల్..

mother dangerous reel with child goes viral: కొంత మంది ఇటీవల కాలంలో రీల్స్ పిచ్చిలో ఏదైన చేస్తున్నారు. తమప్రాణాలు మాత్రమే కాకుండా.. పక్కవారి ప్రాణాలు సైతం రిస్క్ లో పడేస్తున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ లు, మెట్రోలు, ఎయిర్ పోర్టులలో కూడా రీల్స్ తీసుకుంటూ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. కొంత మంది ఇటీవల రీల్స్ తీసుకుంటూ తమ ప్రాణాలు సైతం కోల్పోయారు. సరస్సులు, జలపాతాలు, ఎత్తైన కొండలలో ఇటీవల రీల్స్ పిచ్చిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల బైక్ ల మీద రీల్స్ తీసుకుంటూ యువత రెచ్చిపోతున్నారు. బైక్ ల మీద, ఓపెన్ టాప్ కార్లలో కూడా రోమాన్స్ రీల్స్ సైతం చేసుకుంటున్నారు. ఎవరు చేస్తే మాకేం అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ప్రస్తుతం పోలీసులు ఇటీవల రీల్స్ వ్యవహారంపైన సీరియస్ గా చర్యలు తీసుకుంటున్నారు. 

 

రద్దీగా ఉన్న ప్రాంతాలలో రీల్స్ తీసుకుంటూ అందర్ని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కొంత మంది సోషల్ మీడియాలో తమ పైత్యం చూయిస్తున్నారు. ఫాలోయింగ్ పెంచుకునేందుకు ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తున్నారు. లైక్ లు, కామెంట్ల కోసం ఎంతకైన తెగిస్తున్నారు. ఈ క్రమంలో ఒక తల్లి తనబిడ్డను బావిమీద కూర్చుండబెట్టి చేసిన పని వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు తిట్టిపోస్తున్నారు.

పూర్తి వివరాలు..

ఒక మహిళ పొలంలో తన బిడ్డతో కలిసి వెళ్లింది. ఆమెకు మరీ రీల్స్ పిచ్చి ఉందో ఏంటోకానీ.. రోటిన్ గా తీస్తే ఎవరు చూస్తారు.. ఏదైన పైత్యం చూపించాలని ప్లాన్ చేసింది. దీంతో ఆమెకు ఒక బావి కన్పించింది. ఇంకేముంది.. బావిమీద కూర్చుంది. అంతేకాకుండా.. తన పిల్లాడ్ని సైతం..తన చేతిలో పట్టుకుని బావిలో వేలాడేలా పట్టుకుంది . పాపాం... బుడ్డొడు ఒకవైపు వేలాడుతూ భయం భయంగా చూస్తున్నాడు. మరోవైపు తల్లి మాత్రం.. దిక్కుమాలిన రీల్స్ లో బిజీ అయిపోయింది.

Read more: Romance Video: బస్సులో రెచ్చిపోయిన లవర్స్.. సీక్రెట్ గా రొమాన్స్ చేసుకుంటూ హల్ చల్.. వీడియో వైరల్..

ఆమెకు ఎదురుగా.. ఎవరో దీన్ని రికార్డు చేస్తున్నారు. పిల్లాడు మాత్రం భయంతో వణికిపోవడం వీడియోలో స్పష్టంగా కన్పిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు.. బాప్ రే ... ఇదేం పైత్యం అంటూ కామెంట్ లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఆ పిల్లాడు పడిపోతే.. ఎలా అంటూ మండిపడుతున్నారు. ఆమెపై వెంటనే కేసు పెట్టాలని కూడా మరికొందరు నెటిజన్ లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది మాత్రం సోషల్ మీడియాలో రచ్చగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News