Garikapati Narasimha Rao To Talk with Chiranjeevi on his Odd Behaviour: మెగాస్టార్ చిరంజీవి -గరికపాటి నరసింహారావు వివాదం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. బీజేపీ సీనియర్ నేత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రతి ఏడాది తెలంగాణ సంస్కృతి చాటి చెప్పే విధంగా అలయ్ బలయ్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. పార్టీలతో, సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రముఖ వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా నిన్న జరిగిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే గరికపాటి నరసింహారావు ప్రవచనం మొదలు పెట్టే సమయానికి మెగాస్టార్ చిరంజీవి చుట్టూ చాలామంది చేరి ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపిస్తున్న సమయంలో ‘’చిరంజీవి గారు మీరు ఫోటో సెషన్ ఆపితే కానీ నేను ప్రవచనం మొదలుపెట్టలేనని, మీరు ఆపితే తాను మొదలు పెడతానని మైక్ లోనే ఆయన అనౌన్స్ చేశారు.


అంతేకాక ఆపేది లేదంటే చెప్పండి నేను ఇక్కడి నుంచి ప్రవచనాలు ఆపేసి వెళ్లిపోతానని పేర్కొన్నారు. వెంటనే చిరంజీవి ఫొటోస్ సెషన్ ఆపేసి తర్వాత ఫోటోలు తీసుకుందామని తనతో ఫోటోలు తీసుకునే అందరితో చెప్పారు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి గరికపాటి దగ్గరికి వెళ్లి తనకు గరికపాటి అంటే ఎంత అభిమానమో చెప్పడమే కాక తమ ఇంటికి భోజనానికి కూడా రావాలంటూ అక్కడికక్కడే కోరారు. అయితే అక్కడితో వివాదం సమసిపోతుందనుకున్నారు కానీ ఈ విషయం మీద నాగబాబు పరోక్షంగా ఒక కౌంటర్ ట్వీట్ చేయడంతో వివాదం ముదిరింది.



దీంతో నాగబాబును చూసి మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కూడా ఒక స్థాయిలో రెచ్చిపోయారనే చెప్పాలి. గరికపాటి మీద తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు భవాని రవికుమార్ ఒక అడుగు ముందుకు వేసి గరికిపాటికి ఫోన్ చేయడమే గాక ఆ ఫోన్ చేసిన కాల్ రికార్డింగ్ కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. గరికపాటి కి ఫోన్ చేసిన భవాని రవికుమార్ మీరంటే తమకు చాలా అభిమానం అని, మెగాస్టార్ చిరంజీవి గారి లాగానే మీకు కూడా అసంఖ్యాక అభిమానులు ఉన్నారని అయితే మెగాస్టార్ చిరంజీవితో మీరు అలా ప్రవర్తించి ఉండకూడదని చెప్పుకొచ్చారు.


ఈ విషయంలో మేము చాలా బాధపడుతున్నామని భవాని శంకర్ పేర్కొనడంతో కచ్చితంగా ఈ విషయంలో నేను చిరంజీవి గారితో మాట్లాడతానని గరికిపాటి పేర్కొన్నారు. దీంతో ఈ వివాదం ఇక్కడతో సద్దుమణిగే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనేది?
Also Read: Rashmika- Vijay to Maldives: మాల్దీవులకు రష్మిక, విజయ్.. సంధింగ్ సంధింగ్ అంటూ మళ్లీ రచ్చ!


Also Read: Dhanush - Aishwarya : మళ్లీ ఒక్కటవ్వబోతోన్న ఐశ్వర్య - ధనుష్.. ఇంతలో ఏం జరిగిందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook