Dhanush - Aishwarya : మళ్లీ ఒక్కటవ్వబోతోన్న ఐశ్వర్య - ధనుష్.. ఇంతలో ఏం జరిగిందంటే?

Dhanush And Aishwarya Rajinikanth Reunite  ప్రస్తుతం రజనీకాంత్ అభిమానులకు, ధనుష్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కిచ్చే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ఐశ్వర్య ధనుష్ ఇద్దరూ మళ్లీ ఒక్కటి కాబోతోన్నారట. ఈ మేరకు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 7, 2022, 01:19 PM IST
  • కోలీవుడ్‌లో మళ్లీ కలవబోతోన్న క్రేజీ జంట
  • ఒక్కటి కాబోబోతోన్న ధనుష్ ఐశ్వర్య
  • పిల్లల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారా?
Dhanush - Aishwarya : మళ్లీ ఒక్కటవ్వబోతోన్న ఐశ్వర్య - ధనుష్.. ఇంతలో ఏం జరిగిందంటే?

Dhanush - Aishwarya :  సినీ పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు ఇవన్నీ కామన్ అయిపోయాయి. ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. కొన్నేళ్లకే విడిపోతోంటారు. అయితే విడిపోయిన జంట మళ్లీ కలిసి పోవడం అన్నది ఎక్కువగా జరగదు. కానీ ప్రస్తుతం ఓ జంట విషయంలో ఇది జరుగుతోంది. ధనుష్ ఐశ్వర్య రజినీకాంత్‌లు కలిసిపోనున్నారట. ఈ మేరకు కోలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ కూడా ఈ ఏడాది ప్రారంభంలో విడాకుల గురించి అధికారికంగా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

18 ఏళ్ల పాటు తామిద్దరం మంచి స్నేహితుల్లా, భార్యాభర్తల్లా, తల్లిదండ్రుల్లా, శ్రేయోభిలాషుల్లా కలిసి ఉన్నాం.. అర్థం చేసుకుంటూ సర్దుకుంటూ ఉన్నామని కానీ తామిప్పుడు ఒకే దారిలో ప్రయాణించే స్థాయిలో లేమంటూ పరస్పర అంగీకారంతోనే విడిపోతోన్నామని, మా వ్యక్తిగత జీవితాన్ని, నిర్ణయాలను అందరూ గౌరవిస్తారని ఆశిస్తున్నామన్నట్టుగా ధనుష్, ఐశ్వర్యలు పోస్టులు వేశారు.

అయితే ఇప్పుడు మాత్రం ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ ఇద్దరూ మళ్లీ కలిసి జీవించబోతోన్నట్టు తెలుస్తోంది. ఇన్ని రోజులు ధనుష్, రజినీ ఫ్యాన్స్ కాస్త బాధలో ఉన్నారు. ధనుష్ ఐశ్వర్యలు విడిపోవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అయితే ఇప్పుడు కలిసి పోతోన్నారనే వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పెద్దల సమక్షంలో అందరూ కలిసి ఒప్పించడంతో కాస్త పట్టువిడుపులు వదిలేశారని, పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇక ధనుష్ ఐశ్వర్యలు కలిసి పోతోన్నారనే వార్తలు వస్తున్నప్పటి నుంచి నాగ చైతన్య, సమంత అభిమానుల్లోనూ ఆశలు చిగురించాయి. ఈ ఇద్దరూ కూడా కలిసి పోతే ఎంత బాగుంటుందో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ప్రస్తుతం ధనుష్ నేనే వస్తున్నా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది దారుణంగా బెడిసికొట్టేసింది. అంతకు ముందు తిరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు.

Also Read : Nagababu-Garikapati-Chiranjeevi : చిరుపై గరికపాటి సీరియస్.. ఇంత రాద్దాంతం చేయాలా?

Also Read : Bithiri Sathi Car : రేంజ్ రోవర్ కొన్న సత్తి.. ఆడి కొనేసిన హర్.. రేట్లు ఎంతంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News