Garikipati Narasimha Rao gives Strong Counter To Anantha Sriram: హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో గరికపాటి మెగాస్టార్ చిరంజీవి మధ్య ఏర్పడిన వివాదం, ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ కార్యక్రమం జరిగి సుమారు పది రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఏదో ఒక రకంగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతూనే వస్తుంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఈ విషయం గురించి చర్చించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గరికపాటి కూడా ఈ విషయంలో తన పొరపాటు అయినట్లుగా మెగాస్టార్ అభిమాని ఒకరు ఫోన్ చేసిన సమయంలో బదులిచ్చిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే గాడ్ ఫాదర్ సినిమా బ్లాక్ బస్టర్ మీట్ అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేయగా ఆ కార్యక్రమంలో ఈ సినిమాకు లిరిక్స్ అందించిన అనంత శ్రీరామ్ మాట్లాడుతూ సీతాదేవి, రాముడి గురించి ఒక కథ చెబుతూ ఒకానొక సమయంలో రాముడు గడ్డిపరకతో కాకిని పారద్రోలటానికి ఆ గడ్డి పరక బ్రహ్మాస్త్రంగా మారుతుందని అంత మూలాన ఆ గడ్డిపరక తానే బ్రహ్మాస్త్రం అనుకుంటే కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు.


అలా బ్రహ్మాస్త్రంగా మార్చిన రాముడిని గొప్పతనం కానీ ఆ గరికది కాదంటూ గరికపాటిని పరోక్షంగా కౌంటర్లు వేశారు. ఇక తాజాగా ఈ కౌంటర్లకు గరికపాటి కూడా పరోక్షంగా కౌంటర్లు వేశారు. ఆయన కూడా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఒకానొక సమయంలో సీతాదేవి రావణాసురుడితో మాట్లాడటం ఇష్టం లేక ఒక గరికను అడ్డం పెట్టుకొని గరికతో మాట్లాడుతున్నట్లుగా రావణాసురుడుతో మాట్లాడుతుందని ఆ సమయంలో గరిక లేకపోతే ఈ గరికపాటి లేకపోతే ఎవరితో మాట్లాడి ఉండేది అంటూ గరికపాటి నరసింహారావు కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


ఒక అష్టావధానం కార్యక్రమంలో గరికపాటి నరసింహారావు ఈ కామెంట్స్ చేసినట్లు ఒక వీడియో వైరల్ అవుతుంది. అయితే అది ఆయన అనంత శ్రీరామ్ ఉద్దేశించి కామెంట్ చేశారా ? లేదా> అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. చూడాలి మరి ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళుతుంది అనేది.


Also Read: Nayanthara Surrogacy : సరోగసితో చిక్కుల్లో నయన్ విఘ్నేశ్.. ఆ లూప్ హోల్‌తో తప్పించుకునేందుకు విఫల ప్రయత్నాలు


Also Read: Kantara Telugu Movie Review : కాంతారా మూవీ రివ్యూ.. నటనలో శభాష్ అనిపించే రిషబ్.. మెంటలెక్కించే క్లైమాక్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook