Jeevitha Rajasekhar Issue: జీవిత రాజశేఖర్ వర్సెస్ గరుడ వేగ నిర్మాత వివాదం రచ్చరచ్చవుతోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు సంధించుకుంటున్నారు. తాజాగా జీవిత కాళ్లు పట్టుకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆ నిర్మాత..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం జీవితా రాజశేఖర్ విషయమే హాట్ టాపిక్ అవుతోంది. జీవిత రాజశేఖర్, గరుడ వేగ నిర్మాత కోటేశ్వరరాజు వివాదం ముదురుతోంది. రోజురోజుకూ ఒకరిపై మరొకరు ఆరోపణలు సంధించుకుంటూ రచ్చరచ్చచేస్తున్నారు. 26 కోట్లు తీసుకుని ఎగవేశారంటూ జీవిత రాజశేఖర్‌పై నిర్మాత రాజు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. దీంతో పరిస్థితి ముదిరింది. తనపై కేసు పెట్టడంతో జీవిత రాజశేఖర్ మీడియా సమావేశం పెట్టి..నిర్మాత రాజుపై ప్రత్యారోపణలు చేసింది. తమ పరువు తీసేందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. కేసులుంటే కోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.


ఇప్పుడు మరోసారి నిర్మాత కోటేశ్వరరాజు జీవితరాజశేఖర్‌పై ఆరోపణలు చేశాడు. జీవిత గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు. తనలాంటి చాలామంది నిర్మాతల్ని ట్రాప్ చేసి డబ్బులు గుంజుతోందని సంచలన ఆరోపణలు చేశాడు. అయితే తాను అటువంటివాడిని కాదని..ఆ ట్రాప్‌లో పడమని నిర్మాత కోటేశ్వరరాజు స్పష్టం చేశాడు. మామ వరదరాజన్‌తో వచ్చి తన కాళ్లు పట్టుకుంటే కనికరించి డబ్బులు అప్పుగా ఇచ్చామంటున్నాడు. సినిమా ముసుగులో జీవిత చాలామందిని ఇలానే మోసం చేసిందన్నాడు. ఇప్పుడు తమను ఇరికించాలని చూస్తోందని మండిపడ్డాడు. ఆవలిస్తే పేగులు లెక్కబట్టగలమని..అంతు తేలుస్తామని చెప్పారు. రాజశేఖర్ యాక్సిడెంట్లు చేయడం, ఆమె కవర్ చేయడం ఎవరికి తెలియదని ప్రశ్నించారు. జీవిత రాజశేఖర్ బతుకుంతా మోసమేనని చెప్పాడు. జీవితపై నిర్మాత కోటేశ్వరరాజు చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


Also read: adipurush: ఆదిపురుష్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.