Game on Movie will Release on Summer ప్రస్తుతం చిన్నా, పెద్ద సినిమాలకు తేడా లేకుండా పోతోంది. కంటెంట్ బాగుంటే సినిమాలను జనాలు ఆదరిస్తోన్నారు. ఇప్పుడు ఇలాంటి డిఫరెంట్ కంటెంట్‌తో వస్తోన్న సినిమాలకు ఆదరణ ఉంటోంది. ఈ క్రమంలోనే గీతానంద్‌, నేహా సోలంకిలు హీరో హీరోయిన్లుగా గేమ్ ఆన్ సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కస్తూరి క్రియేషన్స్‌ ప్రొడక్షన్‌, గోల్డెన్‌ వింగ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ల మీద రవి కస్తూరి ఈ సినిమాను నిర్మిస్తుండగా..  దయానంద్‌ దర్శకత్వం వహించాడు. తమ్ముడి దర్శకత్వంలో అన్న హీరోగా నటించడం ఈ చిత్రానికి ఉన్న ఓ స్పెషల్ అట్రాక్షన్. ఈ సినిమాలో మధు బాల, ఆదిత్య మీనన్, బిగ్ బాస్ వాసంతిలు‌ కీలక పాత్రలు పోషించారు.


ఈ సినిమాను సమ్మర్ కానుకగా రిలీజ్ చేస్తామంటూ అప్డేట్ ఇచ్చారు. అనంతరం ఈ మూవీ నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ.. అన్నదమ్ములైన గీతానంద్‌, దయానంద్‌ ఇద్దరిలో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మధుబాల గతంలో ఉన్నడూ చేయని పాత్ర చేసిందని తెలిపారు.


Also Read:  Sneha Reddy Pics : అల్లు అర్జున్ బర్త్ డే పార్టీ.. కాక పుట్టించేలా పొట్టి డ్రెస్సులో స్నేహా రెడ్డి


ఇటీవల విశ్వక్‌సేన్‌ విడుదల చేసిన టీజర్‌, అంతకుముందు వదిలిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పుకొచ్చాడు. దర్శకుడు దయానంద్‌ మాట్లాడుతూ  యాక్షన్‌, రొమాన్స్‌. ఎమోషన్స్‌... అన్ని రకాల ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను రూపొందించామని తెలిపాడు. ఈ చిత్రంలో పాత్రలన్ని గ్రే షేడ్‌లో ఉంటాయని, అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుందని హీరో గీతానంద్‌ చెప్పుకొచ్చాడు. మరి సమ్మర్‌లో గేమ్ ఆన్ టీజర్ ఎలాంటి స్పందనను తెచ్చుకుంటుందో చూడాలి.


Also Read: AR Rahman For RC 16 : బుచ్చిబాబు రామ్ చరణ్‌ కోసం ఏఆర్ రెహమాన్.. అప్పుడే నెగెటివ్ సెంటిమెంట్లు?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook