Game on Song : తమ్ముడు యాక్షన్ అన్న రొమాన్స్.. గేమ్ ఆన్ పాటల సందడి
Geet Anand in Game on గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన గేమ్ ఆన్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి పడిపోతోన్నా అనే పాట వచ్చింది. దీనికి సంబంధించిన పడిపోతోన్నా అనే పాట విడుదలైంది.
Game on Padipothunna Song తమ్ముడి దర్శకత్వం, అన్న రొమాన్స్ చేయడం అనేది చాలా రేర్‌గా జరుగుతుంది. గేమ్ అనే సినిమాతో తమ్ముడు దర్శకుడిగా చేస్తూ ఉంటే అన్న హీరోగా నటిస్తున్నాడు. గీతానంద్, నేహా సోలంకి జంటగా తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఆన్. కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి ఈ సినిమాను నిర్మిస్తుండగా దయానంద్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమాలో మధుబాల, ఆదిత్య మీనన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి పడిపోతున్న అనే సెకండ్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను కిట్టు విస్సా ప్రగడ రాయగా.. అశ్విన్- అరుణ్ బాణీ అందించారు. ఇక ఈ పాటను అనురాగ్ కులకర్ణి - హారిక నారాయణ్ ద్వయం ఆలపించింది.
పాటను రిలీజ్ చేసిన అనంతరం నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ.. ఇప్పటికే విడుదల చేసిన ‘గేమ్ ఆన్’ టైటిల్, ఫస్ట్ లుక్‌లకు మంచి స్పందన వచ్చిందని అన్నాడు. నవాబ్ గ్యాంగ్ తమ సినిమా కోసం చక్కని సంగీతం అందించిందని చెప్పుకొచ్చాడు. ఇద్దరు అన్న దమ్ములుగా వర్క్ చేశారని, ఒకరు హీరోగా, ఒకరు డైరెక్టర్ గా ఈ సినిమా చెయ్యడం విశేషమని అన్నాడు.
దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ.. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉంటుందని తెలిపాడు. మా బ్రదర్‌పై నమ్మకంతో ఈ కథ రాసుకుని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నానని తెలిపాడు. ఈ సినిమాకు హీరోగా, దర్శకుడుగా మేము ఇద్దరు అన్నదమ్ములం పోటీ పడి పని చేస్తున్నామని తెలిపాడు. యాక్షన్, రొమాన్స్. ఎమోషన్స్ ఇలా అన్ని రకాలుగా మెప్పిస్తుందని చెప్పుకొచ్చాడు.
Also Read: Manchu Family Fighting : మంచు బ్రదర్స్ వివాదం.. రంగంలోకి మోహన్ బాబు?.. వెనక్కి తగ్గిన మనోజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook