Manchu Family Fighting : మంచు బ్రదర్స్ వివాదం.. రంగంలోకి మోహన్ బాబు?.. వెనక్కి తగ్గిన మనోజ్

Mohan Babu Fires on Manchu Manoj కడుపు చించుకుంటే కాళ్ల మీద పడ్డట్టు.. ఇప్పుడు మంచు వారి గౌరవం రోడ్డున పడినట్టు అయింది. ఇంత కాలం క్రమశిక్షణకు మారు పేరు అంటూ విర్రవీగిన మంచు కుటుంబం ఇప్పుడు గొడవలు పెట్టుకుని పరువుతీసుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2023, 12:17 PM IST
  • మంచు బ్రదర్స్ మధ్య గొడవలు
  • మంచు మనోజ్ ఇంటిపై విష్ణు దాడి
  • కొడుకులపై మోహన్ బాబు సీరియస్
Manchu Family Fighting : మంచు బ్రదర్స్ వివాదం.. రంగంలోకి మోహన్ బాబు?.. వెనక్కి తగ్గిన మనోజ్

Mohan Babu Fires on Manchu Manoj మంచు వారింట్లో కలహాలు తారాస్థాయికి చేరుకున్నట్టుగా కనిపిస్తోంది. మంచు మనోజ్‌కు సన్నిహితంగా ఉన్న సారథి అనే వ్యక్తి మీద మంచు విష్ణు దాడి చేసినట్టుగా కనిపిస్తోంది. సారథి ఇంటికి వెళ్లి మరీ విష్ణు గొడవ చేసినట్టుగా కనిపిస్తోంది. మంచు విష్ణు చేస్తోన్న గొడవకు సంబంధించిన వీడియోను మనోజ్ తన ఫేస్ బుక్ స్టోరీలో షేర్ చేశాడు. అంతకు ముందు ఇన్ స్టా స్టోరీలోనూ పెట్టి డిలీట్ చేశాడు.

ఇదిగో అండి ఇలా ఇంటి మీదకు వచ్చి అందరినీ కొడుతుంటాడు అని మంచు మనోజ్ అన్న మాటలు అందులో కనిపిస్తున్నాయి. అంతకంటే ముందు మంచు విష్ణు సైతం మనోజ్ మీద సీరియస్ అయ్యాడు. అరేయ్ ఒరేయ్ అని ఏదో అంటున్నాడు కదా? అని విష్ణు కాస్త సీరియస్‌గా కనిపించాడు. అయితే అన్నదమ్ముల మధ్య గొడవపై మోహన్ బాబు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది.

అన్నాదమ్ముల మధ్య గొడవలు సహజమని, ఆవేశం అనార్థాలకు దారి తీస్తుందని వారు తెలుసుకోలేకపోతోన్నారని, వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చాడట. అయితే ఇలా సోషల్ మీడియాలో వీడియో పెట్టడంపై మనోజ్‌ మీద సీరియస్ అయ్యాడట. వెంటనే డిలీట్ చేయమని ఫైర్ అయ్యాడట. దీంతో మనోజ్ వెంటనే ఆ వీడియోను డిలీట్ చేశాడు.

అయితే మంచు మనోజ్, మంచు విష్ణు ఇంతలా రోడ్డుకి ఎక్కడం ఏంటని? అసలు అంత వరకు వ్యవహారం ఎలా వచ్చిందని అంతా అనుకుంటున్నారు. మంచు మనోజ్ రెండో పెళ్లి వల్లే ఇదంతా జరిగిందా? ఇందులో రాజకీయ కోణం ఉందా? అన్నది తెలియడం లేదు. అయితే మంచు విష్ణు మీద మనోజ్ పోలీస్ కేసు పెట్టే యోచనలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మంచు మనోజ్ పెళ్లి విషయంలోనూ విష్ణు అసంతృప్తితోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే పెళ్లిలో ఎక్కువగా కనిపించలేదు. గెస్ట్ మాదిరిగా వచ్చి వెళ్లినట్టు తెలుస్తోంది.

Also Read:  Prabhas Salaar : పాటలు, కామెడీ లేకుండానే విడుదల.. సలార్ మేకర్ల నిర్ణయం కరెక్టే!

Also Read: Jabardasth Indraja : షోలో ఇంద్రజకు అవమానం.. ఇది కరెక్ట్ కాదంటూ ఎమోషనల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x