Geetha Madhuri Husband Six Pack గీతా మాధురి, ఆమె భర్త నందు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. తమ మీద వచ్చే రూమర్లను ఫన్నీగా తిప్పి కొడుతుంటారు. ఆ మధ్య యాంకర్ రష్మీకి, నందుకి మధ్య ఏదో నడుస్తోందని, గీతా మాధురిని దూరంగా పెట్టారంటూ యూట్యూబ్‌లో వచ్చిన ఫన్నీ రూమర్ల మీద ఎలాంటి కౌంటర్లు వేశారో అందరికీ తెలిసిందే. నందు కూడా తన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాను భుజానికి ఎత్తుకుని ప్రమోట్ చేసుకున్నాడు. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇప్పుడు నందు మళ్లీ కొత్తగా ట్రై చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సవారి సినిమా హిట్ అయింది.. బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడు కొత్త సినిమా కోసం ఇలా కష్టపడ్డట్టు కనిపిస్తోంది. నందు ఇంతకు ముందు కాస్త చబ్బీగా కనిపించేవాడు. కానీ ఇప్పుడు పూర్తిగా ఇలా సిక్స్ ప్యాక్ లుక్కులోకి మారిపోయాడు. అయితే ఈ మార్పుని జనాలు జీర్ణించుకోలేకపోతోన్నారు.


 



ఇదేం బాలేదని, ఎవరి బాడీకో నీ తలను యాడ్ చేసినట్టుగా ఉంది.. మార్పింగ్ చేసినట్టుగా ఉందని నానా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ లుక్ ఏమీ బాగా లేదని, మునుపటి లుక్కే బాగుండేదని అన్నా అంటూ నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెట్టేస్తున్నారు. అయితే నందు తన ఫోటోను షేర్ చేస్తూ కామెంట్ల సెక్షన్‌ను మూసి వేశాడు. ఇంకో పోస్ట్‌కు మాత్రం కామెంట్లను పెట్టేందుకు వీలుగా ఉంచేశాడు.


ఏది ఏమైనా ఇలా రూపాంతరం చెందడానికి నందు చాలానే కష్టపడ్డట్టు కనిపిస్తోంది. కానీ జనాలకు మాత్రం ఇది అంతగా నచ్చినట్టు కనిపించడం లేదు. మరి నందు ఇంతగా కష్టపడ్డది ఎందుకు? ఏ సినిమా కోసం ఇలా మారిపోయాడు? అన్న సంగతులేవి ఇంకా తెలియడం లేదు. నందు క్రికెట్ కామెంటరీ ఎంత బాగా చెబుతాడో అందరికీ తెలిసిందే. ఐపీఎల్ తెలుగు మ్యాచ్‌లకు నందు చెప్పే కామెంటరీ వైరల్ అవుతుంటుంది.


Also Read : Rashmika Mandanna Dating : రష్మిక ప్రస్తుత దుస్థితికి కారణం విజయ్ దేవరకొండనా?.. వేణు స్వామి కామెంట్స్ వైరల్


Also Read : Namrata Mahesh Babu Dating : డేటింగ్ సమయంలో అదే చేశాం.. ఎప్పుడూ బోర్ కొట్టనివ్వలేదు.. మహేష్‌పై నమ్రత కామెంట్స్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook