Namrata Mahesh Babu Dating : డేటింగ్ సమయంలో అదే చేశాం.. ఎప్పుడూ బోర్ కొట్టనివ్వలేదు.. మహేష్‌పై నమ్రత కామెంట్స్

Namrata Mahesh Babu Dating నమ్రత, మహేష్ బాబుల లవ్ స్టోరీ గురించి అందరికీ తెలిసిందే. వంశీ సినిమాతో ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. అతడు సినిమా సమయంలో పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు నమ్రత తమ డేటింగ్ సంగతులు చెప్పింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 22, 2022, 03:53 PM IST
  • వంశీ సినిమా కలిపింది ఇద్దరినీ
  • నాలుగేళ్ల డేటింగ్ విషయంపై నమ్రత
  • మహేష్ ఎప్పుడూ బోర్ కొట్టించలేదన్న నమ్రత
Namrata Mahesh Babu Dating : డేటింగ్ సమయంలో అదే చేశాం.. ఎప్పుడూ బోర్ కొట్టనివ్వలేదు.. మహేష్‌పై నమ్రత కామెంట్స్

Namrata Mahesh Babu Dating మహేష్ బాబు నమ్రత శిరోద్కర్‌ ప్రేమ, పెళ్లి విషయాల గురించి అందరికీ తెలిసిందే. మోడలింగ్, బాలీవుడ్ నుంచి వచ్చిన నమ్రత వంశీ సినిమాలో మహేష్ బాబుతో కలిసి పని చేసింది. ఈ సినిమా టైంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఓ నాలుగేళ్ల పాటు డేటింగ్ చేశారు. ఆ తరువాత అతడు సినిమా టైంలో పెళ్లి చేసుకున్నారు. అయితే తాజాగా నమ్రత తన పర్సనల్ విషయాలను చెబుతూ.. డేటింగ్ నాటి సంగతులు, ప్రేమ సంగతులు చెప్పేసింది.

నమ్రత నార్త్‌కు చెందిన వ్యక్తి. మహేష్ బాబు సౌత్‌. ఈ ఇద్దరి ప్రాంతాలు, భాషలు అన్నీ కూడా వేరు. అయితే ఇద్దరూ కూడా వంశీ సినిమా సెట్‌లోనే కలిశారు. పెళ్లి చేసుకుని వచ్చాక ఎలా సెట్ అయ్యారు.. ఎలా కలిసిపోయారు.. ఇక్కడి వాతావరణం మీకు ఎలా సెట్ అయింది? అంటూ ఇలా ఎన్నో ప్రశ్నలకు నమ్రత సింపుల్‌గా సమాధానం ఇచ్చింది.

డేటింగ్ సమయంలోనే మహేష్‌ బాబుతో ఎక్కువగా సినిమా షూటింగ్‌లకు వెళ్లేదని, షూటింగ్ పూర్తయ్యాక.. మహేష్‌ బాబుతో చిల్ అయ్యే దాన్ని అంటూ, మహేష్‌ బాబు ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అంతా కూడా కలిసి చిల్ అయ్యే వాళ్లమని నమ్రత చెప్పుకొచ్చింది. మహేష్‌ బాబు ఎప్పుడూ కూడా తనను బోర్ ఫీల్ అయ్యేలా చేయలేదని, ఒంటరిదాన్ని అనే ఫీలింగ్ రానిచ్చే వాడు కాదని చెప్పుకొచ్చాడు.

ఇక మహేష్‌ బాబు, మంజుల ఇలా అందరూ కూడా తనను బాగా చూసుకునే వారని, డేటింగ్ సమయంలో తాను హైద్రాబాద్ టు ముంబై వెళ్తూ వస్తుండేదాన్ని అని, అందుకే హైద్రాబాద్ తనకు అంత కొత్తగా అనిపించేది కాదని, ఇక్కడ కూడా తనకు ఫ్రెండ్స్ ఏర్పడ్డారని నమ్రత చెప్పుకొచ్చింది.

Also Read : Nayanthara : అందుకే ప్రమోషన్లకు రావడం లేదు.. నోరు విప్పిన నయనతార.. నయన్ బాధ అదేనా?

Also Read : Laththi Telugu Movie Review : విశాల్ లాఠీ రివ్యూ.. రొటీన్ రొడ్డకొట్టుడు కొట్టిన లాఠీ  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News