Ghani Movie Review: కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా విడుదల ఆలస్యమవుతున్న 'గని' చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్‌ కలిసి జంటగా నటించిన ఈ మూవీ శుక్రవారం (ఏప్రిల్ 8) థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. అయితే ఈ మూవీ ఎలా ఉంది? బాక్సర్ గా వరుణ్ తేజ్ మెప్పించాడా? తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదివేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమా ఎలా ఉందంటే?


'గని' మూవీ ప్రీమియర్ షోలు గురువారం నుంచే యూఎస్ లో ప్రారంభమయ్యాయి. ఈ మూవీ కోసం వరుణ్ తేజ్ బాక్సర్ గా మారాడు. బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఆయన.. సిక్స్ ప్యాక్ చేసి తెరపై కనిపించారు. దాదాపు 157 నిమిషాల నిడివి కలిగిన ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ ఫర్వాలేదనిపించింది. తొలి అంకం మొత్తం పాత్ర పరిచయానికే ఎక్కువ సమయం వెచ్చించినట్లు అనిపిస్తుంది. అసలు కథ మొదలవ్వడానికి కొంత సమయం పడుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సమకూర్చిన సంగీతం, పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్. 


సెకండాఫ్ లో అసలైన కథ మొదలవుతుంది. బాక్సర్ గా వరుణ్ తేజ్ పాత్ర తీసుకునే కఠోర శిక్షణ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. దీంతో పాటు ద్వితీయార్ధంలో మ్యాచ్ సినిమాకే హైలైట్. సినిమా చూసే ప్రేక్షకులను కుర్చిలోనే కట్టిపడేసే విధంగా ఉన్నాయి. స్పోర్ట్స్ రివేంజ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే సన్నివేశాలు ఉన్నాయి. బాక్సర్ గా వరుణ్ తేజ్ న్యాయం చేశాడు. బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత కనిపించలేదు. దర్శకుడి పనితనం, నిర్మాణ విలువలు బాగున్నాయి. 



కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని సిద్ధు ముద్ద, అల్లు వెంకటేష్ (బాబీ) నిర్మించారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించగా.. ఆయన సరసన బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ లార్నెల్ స్టోవ‌ల్‌, వ్లాడ్ రింబ‌ర్గ్ ఈ చిత్రానికి పనిచేశారు. జగపతిబాబు, సునీల్‌ శెట్టి, ఉపేంద్ర, నవీన్‌చంద్ర కీలక పాత్రలు పోషించారు. 


Also Read: Pawan Kalyan Shooting: ఆ సినిమాలో ఫైట్ సీన్స్ కోసం పవన్ కసరత్తులు!


Also Read: Ananya Ishaan Breakup: బాలీవుడ్ హీరోకు బ్రేకప్ చెప్పేసిన స్టార్ హీరోయిన్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook