Pawan Kalyan Shooting: ఆ సినిమాలో ఫైట్ సీన్స్ కోసం పవన్ కసరత్తులు!

Pawan Kalyan Shooting: 'భీమ్లా నాయక్' మూవీ హిట్ తో జోరుమీదున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఇప్పుడు తన తర్వాతి చిత్రం కోసం రెడీ అవుతున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' చిత్ర షూటింగ్ లో తిరిగి పాల్గొనేందుకు పవన్ సిద్ధమయ్యారు. అయితే దానికి సంబంధించిన యాక్షన్ సీన్స్ కోసం పవన్ కసరత్తులు చేస్తున్నారు. అందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 7, 2022, 11:20 AM IST
Pawan Kalyan Shooting: ఆ సినిమాలో ఫైట్ సీన్స్ కోసం పవన్ కసరత్తులు!

Pawan Kalyan Shooting: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' చిత్ర షూటింగ్ కు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 8 నుంచి ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించనున్నారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరిపి.. దసరాకు సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. 

'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ ను ఓ వార్ సీన్ తో తిరిగి ప్రారంభించనున్నారని తెలుస్తోంది. అందుకోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. స్టంట్ మాస్టర్స్ నేతృత్వంలో ఫైట్ సీన్స్ కోసం వర్కౌట్స్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

రేపటి నుంచి (ఏప్రిల్ 8) తిరిగి ప్రారంభంకానున్న షూటింగ్ లో పవన్ కల్యాణ్ తో పాటు బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా పాల్గొంటారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వీరిద్దరూ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాలో లీడ్ హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. 

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ మరో చిత్రంలో నటించనున్నారు. ఆ సినిమాకు 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఆ తర్వాత 'సైరా నరసింహారెడ్డి' డైరెక్టర్ సురేందర్ రెడ్డితో పాటు సముద్రఖని దర్శకత్వంలో పవన్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికార ప్రకటన రాలేదు. 

Also Read: Ananya Ishaan Breakup: బాలీవుడ్ హీరోకు బ్రేకప్ చెప్పేసిన స్టార్ హీరోయిన్!

Also Read: Raashi Khanna Comments: సోషల్ మీడియాలో నాపై అసత్య ప్రచారాన్ని ఇకనైనా ఆపండి: రాశీఖన్నా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News