Ginna Teaser: వాడు టైంకే వస్తాడు.. వచ్చేప్పుడు బ్యాడ్ టైంను కూడా తీసుకొస్తాడు కదా! ఆసక్తికరంగా జిన్నా టీజర్
Vishnu Manchu`s Ginna movie Teaser Released. మంచు విష్ణు జిన్నా చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు విశేష స్పందన రాగా.. తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు.
Vishnu Manchu's Ginna movie Teaser Released: టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు గతేడాది 'మోసగాళ్ళు' సినిమాతో భారీ ఫ్లాప్‌ను అందుకున్నాడు. హిట్ కొట్టి చాలా రోజులు అవుతుండడంతో.. ఎలాగైనా 'జిన్నా' సినిమాతో మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇషాన్ సూర్య దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను అవ ఎంటర్టైనమెంట్స్ నిర్మిస్తోంది. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ జిన్నా చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు క్రీయేటీవ్ ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
జిన్నా చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు విశేష స్పందన రాగా.. తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. ఒక నిమిషం 9 సెకండ్ల నిడివి గల ఈ టీజర్.. రఘుబాబు డైలాగ్‌తో ఆరంభం అవుతుంది. 'ధూందాంగా పెళ్లి చేస్తున్నావ్.. టెంట్ హౌస్ ఎక్కడి నుంచి అడగ్గా.. ఇంకెవరు మీవోడే' అనే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. 'వాడు టైంకే వస్తాడు.. వచ్చేప్పుడు బ్యాడ్ టైంను కూడా తీసుకొస్తాడు కదా', 'వాడు పనికిమాలినోడమ్మా.. ఊరంత అప్పులు' అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
టీజర్ చూస్తుంటే.. టెంట్ హౌస్ నడిపే మంచు విష్ణు లైఫ్‌లోకి బాలీవుడ్ నటి సన్నీ లియోని ఎంట్రీ ఇస్తుంది. సన్నీకి దెయ్యం పట్టినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. మరి ఆ దెయ్యం వెనుక కథ ఏంటి? అని తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మంచు విష్ణు ఖాతాలో హిట్ పక్కా అనిపిస్తుంది. ఈ సినిమాలో విష్ణుకు జోడీగా హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ నటించారు. గాలి నాగేశ్వరరావు పాత్రలో విష్ణు కనిపించనున్నాడు. జిన్నా సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read: విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా వస్తే... నేను ఖాళీగా కూర్చోవాలా! కేఎల్ రాహుల్ ఫైర్
Also Read: Match Fixed: టీమిండియాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు.. ఐపీఎల్ కోసం మరీ ఇంత కక్కుర్తా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook